NTV Telugu Site icon

Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రతి ఏడాది దేశం విడిచి వెళ్తున్న 2.3 లక్షల మంది హిందువులు..

Ban

Ban

Bangladesh: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ అతి పెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటోంది. తిరుగుబాటు తర్వాత ఛాందసవాదుల ఆధిపత్యం కారణంగా అస్థిరమైన అరాచక వాతావరణం అక్కడి హిందూ సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారే అవకాశం ఉంది. వివక్ష, అణచివేతకు గురవుతున్న హిందూ జనాభా నిరంతరం తగ్గిపోతుంది. నేడు బంగ్లాదేశ్ మొత్తం జనాభాలో హిందువుల వాటా 1951తో పోలిస్తే 14 శాతం మేర తగ్గిపోయింది. బంగ్లాదేశ్‌లో ప్రతి సంవత్సరం 2.3 లక్షల మంది హిందువులు దేశం విడిచి వెళ్ల వలసిన పరిస్థితి ఏర్పాడింది.

Read Also: Astrology: ఆగస్టు 06, మంగళవారం దినఫలాలు

కాగా, బంగ్లాదేశ్‌లో వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్ (గతంలో పాకిస్తాన్ పాలనలో శత్రువుల ఆస్తి చట్టం అని పిలుస్తారు) 1965, 2006 మధ్య హిందువులకు చెందిన సుమారు 26 లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో 12 లక్షల హిందూ కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. అలాగే, 2016 జనవరి- జూన్ మధ్య బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకున్న హింసలో 66 ఇళ్లు దగ్ధమయ్యాయి.. ఇందులో 24 మంది గాయపడ్డడంతో పాటు 49 దేవాలయాలు ధ్వంసమయ్యాయి. హిందువులకు వ్యతిరేకంగా ఛాందసవాద ఉద్యమం 1980, 1990 మధ్య తీవ్ర స్థాయిలో కొనసాగింది. 1990లో అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేసిన తర్వాత చిట్టగాంగ్, ఢాకాలోని అనేక హిందూ దేవాలయాలకు దుండగులు నిప్పు పెట్టారు.

Read Also: Cognizant : హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్

ఇక, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో హిందువులు ప్రత్యేకించి లక్ష్యంగా చేసుకున్నారు. ఎందుకంటే చాలా మంది పాకిస్థానీయులు వారిని దోషులుగా భావించారు. దీంతో హిందూ జనాభా తీవ్రంగా నష్టపోయింది. 1951 అధికారిక జనాభా లెక్కల ప్రకారం.. బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) మొత్తం జనాభాలో హిందువులు 22 శాతం ఉన్నారు. 1991 నాటికి ఈ సంఖ్య 15 శాతానికి పడిపోయింది. కాగా, 2011 జనాభా లెక్కల్లో ఈ సంఖ్య కేవలం 8.5 శాతానికి తగ్గింది. 2022లో అది ఎనిమిది శాతానికి తగ్గిపోయింది. అదే టైంలో ముస్లింల జనాభా 1951లో 76 శాతం ఉండగా 2022 నాటికి 91 శాతానికి పెరిగింది.

Read Also: Lavanya: లావణ్య ప్రయివేట్ పార్ట్స్ మీద శేఖర్ బాషా దాడి?

అలాగూ, హిందూ అమెరికన్ ఫౌండేషన్ యొక్క నివేదిక ప్రకారం.. 1964 నుంచి 2013 మధ్య మతపరమైన హింస కారణంగా 11 మిలియన్లకు పైగా హిందువులు బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు. బంగ్లాదేశ్‌లో ప్రతి సంవత్సరం 2.3 లక్షల మంది హిందువులు దేశం విడిచి వెళుతున్నారని వెల్లడించింది. 2000 నుంచి 2010 మధ్య దేశ జనాభా నుంచి ఒక మిలియన్ హిందువులు అదృశ్యమయ్యారని 2011 జనాభా లెక్కలు తెలియజేస్తుంది.