Site icon NTV Telugu

Pakistan: న్యూస్ ఛానెల్ లో పనిచేస్తున్న హిందూ వ్యక్తి కిడ్నాప్..

Pakistan

Pakistan

Hindu man abducted in pakistan: పాకిస్తాన్ లో మైనారిటీలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే హిందూ బాలికలు అపహరించి బలవంతంగా ముస్లీం వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేసి మతం మారుస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పాక్ లోని సింధ్ ప్రావిన్సుల్లో వందల సంఖ్యలో జరిగాయి. సిక్కులు, క్రిస్టియన్లు కూడా ఇదే విధంగా అణిచివేతను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ లో మరో హిందువు కిడ్నాప్ అయ్యారు. పాకిస్తాన్ న్యూస్ ఛానెల్ లో పనిచేస్తున్న హిందూ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. అతడిని క్షేమంగా వదిలిపెట్టాలని అతడి తల్లి వేడుకుంటోంది.

Read Also: Road Accident: బైసాఖీ వేడుకల వెళ్తున్న క్రమంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ప్రముఖ న్యూస్ ఛానెల్ లో మార్కెటింగ్ హెడ్ గా పనిచేస్తున్న ఆకాష్ రామ్ ని మంగళవారం తెల్లవారుజామున కిడ్నాప్ చేశారు. మీడియా సంస్థ ప్రధాన కార్యాలయం వెలుపల నుంచి కిడ్నాప్ చేసినట్లు అక్కడ ఉన్న సీసీకెమెరాల్లో రికార్డ్ అయింది. అక్కడ నుంచి ఓ వాహనంలో అపహరించారు. అతడితో పాటు సెక్యూరిటీ గార్డు, ఇద్దరు వ్యక్తులను కూడా ఉదయం 6 గంటలకు కిడ్నాప్ చేశారు. బోల్ న్యూస్‌లో బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న గులాం అబ్బాస్ షా, ఆకాష్ రామ్ తల్లి తన కొడుకును సురక్షితంగా ఇంటికి తీసుకురావాలని అధికారులకు పదే పదే వేడుకుంటున్న వీడియోను ట్వీట్ చేశారు.

పాకిస్తాన్ లో మైనారిటీలపై దాడులు, అపహరణలు నిత్యకృత్యంగా మారాయి. ఒక్క మార్చి నెలలోనే మైనారిటీ వర్గాలకు చెందిన ముగ్గురి హత్యలు జరిగాయి. మార్చి 31న పెషావర్‌లోని తన దుకాణంలో దయాళ్ సింగ్ అనే సిక్కు వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. కరాచీ మున్సిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ డైరెక్టర్ మరియు నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ బీర్బల్ గెనాని మార్చి 20న లియారీ ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో కాల్చి చంపబడ్డారు. అతని సహాయకుడు డాక్టర్ ఖురత్-ఉల్-ఐన్ కూడా దాడిలో గాయపడ్డారు. దాడి జరిగినప్పుడు ఇద్దరూ కారులో ప్రయాణిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది.మార్చి 7న, పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన ధరమ్ దేవ్ రాఠీ అనే వైద్యుడు అతని ఇంటిలోనే అతని డ్రైవర్‌చే చంపబడ్డాడు.

Exit mobile version