Hindu groups Wrote open letter to Liz Truss after Leicester violence: ఇటీవల యూకే వ్యాప్తంగా జరగుతున్న పరిణామాలు హిందువులను, భారతీయులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆసియా కప్ లో భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగిన తర్వాత బ్రిటన్ లోని పలు నగరాల్లో హిందూ-ముస్లింల మధ్య ఘర్షణ చెలరేగింది. హిందువుల ఇళ్లు, కార్లు టార్గెట్ గా రాడికల్ ముస్లింగ్రూపులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ముఖ్యంగా లిచెస్టర్ సిటీతో పాటు బర్మింగ్ హామ్ వంటి నగరాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన పరిణామాలపై, హింసాకాండ తర్వాత దేశంలో తమను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని, మమ్మల్ని రక్షించండంటూ 180 బ్రిటీస్ ఇండియన్, హిందూ సంస్థలు యూకే ప్రధాని లిజ్ ట్రస్ కు బహిరంగ లేఖ రాశాయి. హిందూ సమాజానికి స్వల్ప, దీర్ఘకాలికంగా తగిన భద్రత కల్పించేందుకు ఆరు విజ్ఞప్తులు చేశారు. ఇటీవల జరిగిన లిసెస్టర్, బర్మింగ్ హామ్ ఘటనలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. భౌతిక దాడులకు పాల్పడటంతో పాటు సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడుతున్నారని.. పాఠశాలలు, కార్యాలయాల వద్ద హిందువులను టార్గెట్ చేస్తున్నారని ప్రధానికి తెలియజేశారు.
Read Also: Pakistan: బైడెన్ వ్యాఖ్యలపై యూఎస్ రాయబారికి సమన్లు.. భారత్‌పై కామెంట్స్
అర శతాబ్ధానికి పైగా హిందూ సమాజం యూకేను తమ నివాసంగా మార్చుకుందని.. మేము ఈ జనాభాలో 2 శాతం కన్నా ఎక్కువగా ఉన్నామని, బ్రిటన్ చట్టాలను గౌరవిస్తూ, దేశ పురోగతికి సహకరిస్తున్నామని హిందూ సంస్థల ప్రతినిధులు లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రతీ రోజు మేం భయంగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ సమాజం భయాందోళనలో ఉందని.. ఇప్పటికే కొన్ని కుటుంబాలు ఇరుగుపొరుగు ప్రాంతాలను వదిలి వెళ్లగా.. మరికొంత మంది వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారని లేఖలో తెలిపారు.
హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఇటీవల నేారాలకు పాల్పడిన వారిపై పోలీసులు దర్యాప్తు చేయాలని, అల్లర్లలో ధ్వంసం అయిన లిసెస్టర్ లోనా వ్యాపారులకు ఆర్థిక సహాయాన్ని అందించాలని.. హిందూ వ్యతిరేక ద్వేషంపై దర్యాప్తు చేయాలని, బ్రిటన్ లో తీవ్రవాద ముప్పు గుర్తించడం, దీపావళి జరుపుకునే సమయంలో ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని, పాఠశాల్లలో హిందూ ద్వేషాన్ని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆరు డిమాండ్లను బ్రిటన్ ప్రధాని ముందు ఉంచాయి హిందూ సంఘాలు.
