NTV Telugu Site icon

Hezbollah: అక్టోబర్‌ 7 తరహాలో భారీ దాడికి హెజ్‌బొల్లా ప్లాన్‌..

Idf

Idf

Hezbollah: అక్టోబర్‌ 7 తరహా దాడులు చేసేందుకు హెజ్‌బొల్లా సన్నాహాలు చేస్తుందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. ఐడీఎఫ్‌ ప్రతినిధి డానియల్‌ హగారీ మాట్లాడుతూ.. దక్షిణ లెబనాన్‌లోని గ్రామాల్లో ఇళ్లను వాడుకొని దాడులు చేసేందుకు సిద్ధమైందన్నాడు. ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లోని లెబనాన్‌ గ్రామాలను దాడులు చేసేందుకు అనుగుణంగా సైనిక స్థావరాలుగా హెజ్‌బొల్లా మార్చుకుంది.. ఇక్కడి పథకానికి ‘కాంకర్‌ ద గలిలీ’ అని పేరు పెట్టిందని మాకు సమాచారం వచ్చింది. మా సరిహద్దుల్లో మరోసారి అక్టోబర్‌ 7 తరహా ఘటనలు జరగే అవకాశం ఉందని హగారీ పేర్కొన్నాడు.

Read Also: Ram Charan: చరణ్ డాన్స్ కి సమంత ఫిదా.. ఎవరయ్యా ఇలా చేసేది?

కాగా, 2006లో ఐక్యరాజ్యసమితి తీర్మానం 1701 ప్రకారం లిటాని నది దక్షిణ భాగంలో హెజ్‌బొల్లా సైనిక మోహరింపులపై నిషేధం విధించిందని ఐడీఎఫ్ ప్రతినిధి హగారీ గుర్తు చేశారు. ఈ ప్రాంతం లెబనాన్‌ దక్షిణ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. ఈ తీర్మానం చేసి 18 ఏళ్లు దాటినా హెజ్‌బొల్లా దక్షిణ లెబనాన్‌లో ఆయుధాలతో సంచరిస్తుందని విమర్శలు గుప్పించాడు. ఇక, లెబనాన్‌ సర్కార్, ప్రపంచ ఇప్పటి వరకు హెజ్‌బొల్లాను మా సరిహద్దుల నుంచి దూరంగా పంపలేకపోయిందని చెప్పుకొచ్చారు. తమ కోసం ఆ పని తామే చేయక తప్పని పరిస్థితి నెలకొందని అన్నారు.

Read Also: Iran Ex President: అతనే ఇజ్రాయెల్ గుఢచారి.. ఇరాన్లో డబుల్‌ ఏజెంట్లు ఉన్నారు..

ఇక, నిన్న లెబనాన్‌ ప్రధాని నజీబ్‌ మికాతి మాట్లాడుతూ.. తాము 1701 తీర్మానాన్ని పూర్తిగా అమలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. లెబనాన్‌ సైన్యాన్ని మాత్రమే లిటాని నది దక్షిణ భాగంలో మోహరిస్తాం.. ఇజ్రాయెల్‌ సైన్యంలో అత్యంత శక్తిమంతమైన దళాల్లో ఒకటైన ‘డివిజన్‌ 98’ పారా ట్రూపర్‌ కమాండోలు సోమవారం రాత్రి దక్షిణ లెబనాన్‌లోకి అడుగు పెట్టారని చెప్పుకొచ్చారు. దీనికి బ్రిగేడియర్‌ జనరల్‌ గయ్‌లెవి నాయకత్వం వహిస్తున్నాడు పేర్కొన్నాడు. ఈ డివిజన్‌ హమాస్‌ గుండెకాయ లాంటి ‘ఖాన్‌ యూనిస్‌’ ఆధీనంలోకి తెచ్చుకోవడంలో పని చేసింది. డిసెంబర్‌ 2023 నుంచి మార్చి 2024 వరకు అక్కడి యుద్ధంలో పాల్గొనింది అని నజీబ్‌ మికాతి వెల్లడించారు.