NTV Telugu Site icon

Hassan Nasrallah: నస్రల్లా చనిపోయిన 2 వారాల తర్వాత హిజ్బుల్లా ఆడియో సందేశం రిలీజ్..

Hasan

Hasan

Hassan Nasrallah: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా గ్రూప్ హసన్ నస్రల్లా యొక్క ఆడియో రికార్డింగ్‌ను విడుదల చేసింది. ఆ ఆడియోలో, మాజీ హిజ్బుల్లా చీఫ్ తన అనుచరులను “దేశాన్ని రక్షించండి” అని కోరడం వినవచ్చు. గత నెలలో దాహియేహ్‌లోని హిజ్బుల్లా యొక్క భూగర్భ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో నస్రల్లా మరణించారు. మీ ప్రజలు, మీ కుటుంబాలు, మీ దేశం, మీ విలువలు, మీ గౌరవాన్ని రక్షించడానికి ఈ పవిత్రమైన భూమిని, మా ప్రజలను రక్షించడానికి మేము మిమ్మల్ని విశ్వసిస్తున్నామని హసన్ నస్రల్లా హిజ్బుల్లా సభ్యులతో చెప్పిన ఆడియోను రిలీజ్ చేశారు.

Read Also: Rajnikanth: G.O.A.T ను నాలుగు రోజుల్లో లేపేసిన వేట్టయాన్.

అయితే, సెప్టెంబరులో బీరూట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హసన్ నస్రల్లా మరణించాడు. ఇజ్రాయెల్ వైమానిక దళం విడుదల చేసిన దృశ్యాలు సెకన్లలో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. హిజ్బుల్లా యొక్క సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ కరాకితో సహా పలువురు సీనియర్ నాయకులు మరణించారు. ఈ దాడులు ఆరుగురు మరణించాగా, 91 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నస్రల్లాను హత్య చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొనింది. ఇక, ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా డ్రోన్లతో దాడి చేసింది. ఇందులో నలుగురు సైనికులు మరణించగా, మధ్య- ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‌పై హిజ్బుల్లా డ్రోన్ దాడిలో 60 మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బీరూట్‌పై గురువారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 22 మందిని మరణించారు.. దీనికి ప్రతీకారంగా హిజ్బుల్లాహ్ ఆదివారం రాత్రి డ్రోన్లతో దాడులు చేసింది.

Show comments