NTV Telugu Site icon

Japan Floods: జపాన్‌ను ముంచెత్తిన వరదలు.. ఎమర్జెన్సీ అలర్ట్ జారీ

Japanfloods

Japanfloods

ఉత్తర జపాన్‌పై ప్రకృతి మరోసారి ప్రకోపించింది. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో భారీ భూకంపంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. దాంట్లో నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న తరుణంలో మరోసారి ప్రకృతి కన్నెర్ర జేసింది. శనివారం జపాన్‌లోని ఉత్తర మధ్య ప్రాంతమైన నోటోలో భారీ వర్షం కురిసింది. కొండచరియలు విరిగిపడ్డాయి. నదులు ఉప్పొంగి ప్రవహించాయి. మరోవైపు వరదలు ఇళ్లను ముంచెత్తాయి. దీంతో ప్రజలు వరదల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వాజిమాలో ఒకరు తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Love jihad: ‘లవ్ జిహాద్’ ముఠా గుట్టురట్టు.. ఇన్‌స్టాలో ఫేక్ ఐడీలతో స్నేహం కట్ చేస్తే..

ఇక హోకురి ప్రాంతంలో భారీ కుండపోత వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రెయిన్‌బ్యాండ్‌ల కారణంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతంలో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని జేఎంఏ తెలిపింది. ఇప్పటి వరకు భారీ వర్షం కారణంగా ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. వాజిమాలోని రెండు జిల్లాల్లోని కొంతమంది నివాసితులు కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయారని తెలుస్తోంది. బురద నీటితో నిండిన పలు రహదారులు మూసుకుపోయాయి. దాదాపు 6,500 ఇళ్లకు విద్యుత్ సరఫరా లేదని హోకురికు ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ తెలిపింది. సమీపంలోని ఉత్తర ప్రాంతాలైన నీగాటా మరియు యమగటాలలో కూడా భారీ వర్షం కురిసింది.

ఇది కూడా చదవండి: Amar Preet Singh: ఎయిర్ స్టాఫ్‌ చీఫ్‌గా అమర్ ప్రీత్ సింగ్ నియామకం

ఈ ప్రాంతంలో జనవరి 1న 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో 370 మందికి పైగా మరణించారు. రోడ్లు మరియు ఇతర కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. స్థానిక పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థ, రోజువారీ జీవితాలను ప్రభావితం చేశాయి.