యూరప్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతుండటంతో వరదనీరు యూరప్‌లోని బెల్జియం, జర్మనీ దేశాలను ముంచెత్తింది. ఈ వరదల కారణంగా ఇప్పటికే 200 మందికి పైగా మృతిచెందినట్టు సమాచారం. వందల మంది వరదనీటిలో కొట్టుకుపోయారని, వారి ఆచూకీ కోసం డిజాస్టర్ టీమ్, ఆర్మీ బృందాలు గాలిస్తున్నాయని జర్మనీ అధికారులు చెబుతున్నారు. ఈ వరదల ప్రభావం జర్మనీలోని అహాల్వర్ కౌంటీ, రైన్‌లాండ్-పలాటినేట్, నార్ట్‌రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నది. ఇప్పటికే జర్మనీ కరోనా తో విలవిలలాడుతున్నది. సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న సమయంలో ప్రకృతి సృష్టించిన ఈ వరదలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.
Read: ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల మాటతీరు శృతిమించుతోందా..?
