NTV Telugu Site icon

North America: కార్చిచ్చుతో 100 మిలియన్ల మంది ప్రజలకు ఆరోగ్య సమస్యలు

Wildfires

Wildfires

North America: ఉత్తర అమెరికాను కార్చిచ్చు దహించి వేస్తోంది. కెనడా అడవి మంటల వల్ల ఉత్తర అమెరికాలో సుమారు 100 మిలియన్ల మందికి పైగా ప్రభావితమవుతున్నారు. కెనడాలోని అడవి మంటల కారణంగా కెనడా మరియు యుఎస్‌లో కనీసం 100 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కెనడా రికార్డు చరిత్రలో ఈ అడవి మంటలు పెద్దవిగా ఉన్నాయని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చెప్పారు.

Read also

కెనడియన్ నేషనల్ ఫైర్ డేటాబేస్ ప్రకారం ఇప్పటివరకు 3.8 మిలియన్ హెక్టార్లల్లో అడవులు కాలిపోయాయి. ఇది కెనడియన్‌ నేషనల్ ఫైర్‌ డాటాబేస్‌ ప్రకారం గతంలో న్యూజెర్సీలో జరిగిన దానికంటే రెట్టింపు పరిమాణమని పేర్కొంది. కెనడాలో అడవి మంటల కారణంగా 20,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 150 అడవి మంటల ప్రమాదాల మూలంగా న్యూయార్క్‌ నగరం కాలుష్యానికి కారణమవుతుంది. బుధవారం మధ్యాహ్నం నాటికి న్యూయార్క్ నగరంలో ప్రపంచంలోని ఏ నగరంలో లేనంత వాయు కాలుష్యం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
దట్టమైన పొగమంచు కాలుష్యం మూలంగా మాన్హాటన్ నగరంలోని ప్రసిద్ధ ఆకాశహర్మ్యాలపై వింతగా, పసుపు రంగులో మెరుస్తూ కనిపిస్తున్నాయి.

Read also

దట్టమైన వాయు కాలుష్యం కారణంగా విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. కాలుష్యం కారణంగా క్రీడా కార్యక్రమాలను వాయిదా వేయవలసి వచ్చిందని అధికారులు ప్రకటించారు. న్యూయార్క్ యాన్కీస్ మరియు చికాగో వైట్ సాక్స్ మధ్య బుధవారం జరగాల్సిన మేజర్‌ బేస్‌బాల్‌ లీగ్‌కు సంబంధించిన ఆటతోపాటు డెట్రాయిట్ టైగర్స్‌తో జరిగే ఫిల్లీస్ హోమ్ మ్యాచ్‌ను గాలిలో ఉన్న కాలుష్యం కారణంగా వాయిదా వేశారు. మహిళల NBA మరియు నేషనల్ ఉమెన్స్ సాకర్ లీగ్ కూడా వాయిదా వేస్తున్నట్లు నిర్వహణా సంస్థలు ప్రకటించాయి. బ్రూక్లిన్‌లో కొరిన్ బెయిలీ రే ప్రదర్శించే సంగీత కచేరీ సిరీస్‌కు సంబంధించిన ప్రారంభ కార్యక్రమాన్ని రద్దు చేశారు. వినాశకరమైన అడవి మంటల నివారణకు సహకరించడానికి అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ ట్రూడోతో మాట్లాడారు. తమకు మద్దతును అందించాడానికి ముందుకు వచ్చిన అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ ట్రూడో ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపాడు. ఇటువంటి మంటలు తమకు రోజువారీ దినచర్యల్లో భాగమని.. జీవితాలు మరియు జీవనోపాధిని మరియు మన గాలి నాణ్యతను ప్రభావితం చేస్తుంటాయని తెలిపారు.