NTV Telugu Site icon

Israel-Hamas: బందీలకు ఏమైనా జరిగితే ఊరుకోమన్న ఇజ్రాయిల్.. అలా అయితే బందీలను ఉరితీస్తామన్న హమాస్..

Israel Vs Hamas

Israel Vs Hamas

Israel-Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరు పక్షాలు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటున్నాయి. ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. యుద్ధాన్ని హమాస్ మొదలుపెట్టింది, మేము ముగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హమాస్ ఉగ్రసంస్థను నెతన్యాహు ఐసిస్‌తో పోల్చారు. మేము యుద్ధాన్ని కోరుకేలేదు, మాపై రుద్ధబడిందని, ఐసిస్ ను నాశనం చేసేందుకు నాగరిక శక్తులు ఏకమైనట్లే, హమాస్ అంతానికి ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకు తగ్గట్లుగానే ఇజ్రాయిల్ సైన్యం గాజా ప్రాంతంపై బాంబులతో విరుచుకుపడుతోంది.

మరోవైపు ఇజ్రాయిల్ బందీలకు ఉరిశిక్ష విధిస్తామని హమాస్ మిలిటెంట్లు హెచ్చరించారు. గాజా ప్రజల నివాసాలపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా దాడులు చేస్తే ఇజ్రాయిల్ బందీలను చంపేస్తామని హమాస్ మిలిటరీ ప్రతినిధి అబు ఉబైదా హెచ్చరించారు. ఈ మరణశిక్షలను ప్రసారం చేస్తామని అతను చెప్పాడు. ఇక్కో బాంబుకు ఒక్కో బందీని హత్య చేస్తామని హెచ్చరించారు.

Read Also: PM Modi: ఇజ్రాయిల్ ప్రధానితో మాట్లాడిన నరేంద్ర మోడీ.. అండగా ఉంటామని హామీ..

ఇజ్రాయిల్ నుంచి కిడ్నాప్ అయిన వారికి ఏమైనా జరిగితే హమాస్ పరిస్థితి మరింతగా దిగజారుతుందని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్( ఐడీఎఫ్) హెచ్చరికలు జారీ చేసింది. బందీల్లో ఉన్నవారిలో ఒక్క వృద్ధురాలికైనా, పసికందుకైనా వారు హాని చేస్తే హమాస్ పరిస్థితి మరింతగా దిగజారుతుందని, అది వారికి కూడా తెలసని ఐడీఎఫ్ ప్రతినిధి రిచర్డ్ హెచ్చరించారు.

ఇప్పటికే ఈ యుద్ధంలో 1600 మంది చనిపోయారు. హమాస్ దాడిలో 900 మంది ఇజ్రాయిల్ పౌరులు చనిపోగా.. ఇజ్రాయిల్ వైమానికి దళం గాజాపై జరిపిన దాడిలో 700 మందికి పైగా చనిపోయారు. రానున్న రోజుల్లో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే గాజాస్ట్రిప్ ను ఇజ్రాయిల్ దిగ్భందించింది. కరెంట్, తాగునీరు, నిత్యావసరాలన్ని కట్ చేసింది. గాజాలోని ప్రజలు ఈజిప్టు పారిపోవాల్సిందిగా హెచ్చరించింది. ఇజ్రాయిల్ 3,00,000 మంది సైన్యాన్ని సమీకరించింది. వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయిలీలు మాతృదేశ రక్షణ కోసం ఇజ్రాయిల్ కి తీరిగి వస్తున్నారు. గాజా సరిహద్దు ప్రాంతంలో వసతులు, బేస్‌లను ఇజ్రాయిల్ శరవేగంగా నిర్మిస్తోంది.