Site icon NTV Telugu

Israel-Hamas: నేడు ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ కీలక చర్చలు.. బందీల విడుదలపై వీడనున్న ఉత్కంఠ

Netanyahu

Netanyahu

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి మంగళవారంతో రెండేళ్లు పూర్తవుతుంది. అనంతరం గాజాపై ఏకధాటిగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈజిప్టు వేదికగా సోమవారం కీలక సమావేశం జరగబోతుంది. ఈజిప్టు రాజధాని కైరోలో చర్చలు జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్.. వీడియో వైరల్

అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్, ఖతార్‌ విదేశాంగమంత్రి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ థాని సారథ్యంలో చర్చలు జరగనున్నాయి. ఇజ్రాయెల్ పరోక్షంగా పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఈ చర్చల్లో కాల్పుల విరమణ, బందీల విడుదలపై చర్చించనున్నారు. చర్చలు ఫలిస్తే.. వెంటనే హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ ఒకేసారి విడుదల చేయనున్నారు. అలాగే ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తారు.

ఇది కూడా చదవండి: Jaipur: జైపూర్‌ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది రోగులు మృతి

ఇదిలా ఉంటే ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. గడచిన 24 గంటల్లో 65 మంది పాలస్తీనియన్లు చనిపోయారని హమాస్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. ఇక పాలస్తీనియన్లకు మద్దతుగా తుర్కియేలోని అంకారా, ఇస్తాంబుల్‌లో, నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో భారీస్థాయిలో ప్రదర్శనలు జరిగాయి.

అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి యుద్ధం సాగుతూనే ఉంది. రేపటితో రెండేళ్లు పూర్తి చేసుకుంటుంది. మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో పలువురు బందీలను హమాస్ విడుదల చేసింది. పూర్తిగా విడిచిపెట్టకపోవడంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మధ్య ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు. దీనికి ఇజ్రాయెల్ మద్దతు తెల్పగా.. హమాస్ స్పందించలేదు. దీంతో ప్రణాళికకు అంగీకారం తెల్పకపోతే నరకం చూస్తారని హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు. దీంతో హమాస్ దిగొచ్చి చర్చలకు అంగీకారం తెలిపింది. మొత్తానికి సోమవారం కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అంతా సవ్యంగా జరిగితే సోమవారమే బందీలు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Exit mobile version