Gunmen kill 12, including imam, abduct others from mosque in Nigeria: ఆఫ్రికా దేశం నైజీరియాలో ముష్కరులు ఘాతుకానికి పాల్పడ్డారు. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఇమామ్ తో సహా 12 మంది మరణించారు. మరికొంత మంది కిడ్నాప్ చేశారు. ఈ ఘటన నైజీరియా కట్సనా రాష్ట్రంలో జరిగింది. ఇది ప్రెసిడెంట్ మహ్మద్ బుహరీ సొంత రాష్ట్రం. సాధారణంగా బందిపోట్లు ఈ ప్రాంతంలో తరుచుగా ప్రజలపై దాడులు చేస్తుంటారు. ప్రజలను చంపడం, లేదా వారిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేయడం చేస్తుంటారు. ఈ ముఠాలు వ్యవసాయం చేయడానికి, పంటలు పండించడానికి గ్రామస్తుల నుంచి డబ్బును డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Gujarat: ముస్లిం మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడం ఇస్లాంకు వ్యతిరేకం.. మతాన్ని బలహీన పరచాలనే ఇలా..
మోటార్ సైకిల్ పై వచ్చిన ముష్కరులు, రాత్రి వేళ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో కాల్పులు ప్రారంభించారని స్థానికులు వెల్లడించారు. మరికొంత మందిని బలవంతంగా పట్టుకెళ్లారని పేర్కొన్నారు. నైజీరియ వాయువ్య ప్రాంతంలోని కట్సినా రాష్ట్రం, నైజర్ దేశంతో సరిహద్దు పంచుకుంటుంది. బందిపోటు ముఠాలు ఈ రెండు దేశాల సరిహద్దు వెంబడి స్వేచ్ఛగా తిరుగుతుంటారు. నైజీరియా సైన్యం బందిపోట్లు ఉపయోగించే బుష్ శిబిరాలపై దాడులు చేస్తోంది. వచ్చే ఫిబ్రవరీలో ఎన్నికలు జరిగే క్రమంలో ఈ దాడి జరగడం అక్కడి ప్రజల్లో భయాలను పెంచుతోంది.
ఈ ఘటనలో మొత్తం 19 మందిని కిడ్నాప్ చేసింది బందిపోటు ముఠా. పశువులను దొంగిలించడానికి గ్రామాలపై దాడి చేయడం, కిడ్నాప్ చేయడం, దోపిడీ చేయడం, ఇళ్లను తగలబెట్టడం, వ్యవసాయానికి బదులుగా డబ్బును దోపిడీ చేయడం ద్వారా అక్కడి ప్రజలపై దాడులు చేస్తున్నాయి ఈ ముఠాలు. రుగు అటవీ ప్రాంతం బందిపోట్లకు స్వర్గధామంగా ఉంది. గత నెలలో బందిపోట్లు 15 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఖలీఫా రాజ్యాన్ని స్థాపించేందుకు గత 10 ఏళ్ల నుంచి బందిపోట్లు ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. అయితే అధ్యక్షుడు బుహారీ మాత్రం తన పదవీ కాలం పూర్తయ్యేలోగా హింసను అంతం చేస్తానని సవాల్ చేశాడు. దీంతో నైజీరియా సైన్యం బందిపోట్ల ఆవాసాలపై విరుచుకుపడుతున్నారు.
