NTV Telugu Site icon

Gay Prince Marriage: అమెరికాలో వైభవంగా ‘గే’ యువరాజు పెళ్లి..

Gay Prince Marriage

Gay Prince Marriage

గుజరాత్‌కు చెందిన ‘గే’ యువరాజు మన్వేంద్ర సింగ్ గోహిల్ ఓ స్వలింగ సంపర్కుడిని వివాహం చేసుకున్నాడు. 2022 జులై 6న అమెరికాలోని కొలంబస్‌లో డీఆండ్రీ రిచర్డ్​సన్‌ను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. డీఆండ్రీ రిచర్డ్‌సన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ సమాచారాన్ని అందించాడు. ప్రిన్స్ మన్వేంద్ర సింగ్ డీఆండ్రీ రిచర్డ్‌సన్ చాలా సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. ఆండ్రీ రిచర్డ్‌సన్ సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు, వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను కూడా పంచుకున్నారు.

మన్వేంద్ర సింగ్ గోహిల్ రాజ కుటుంబంలో జన్మించాడు. మన్వేంద్ర సింగ్.. మహారాజా రఘువీర్ సింగ్ రాజేంద్ర సింగ్, రాణి రుక్మిణీ దేవిల కుమారుడు. అతను ముంబై స్కాట్స్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను అభ్యసించాడు. ముంబై మిథిబాయి కాలేజీ క్యాంపస్‌లో ఉన్న అమృత్‌బెన్ జీవన్‌లాల్ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు. తన వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా లేదని, ఓ అమ్మాయి జీవితాన్ని పాడుచేశానంటూ పశ్చాత్తాపపడ్డానని.. ఒకసారి తన భార్య నుంచి విడాకుల గురించి ఎమోషనల్ పోస్ట్‌లో చెప్పాడు. 2006లో, అతను ‘గే’ అని ఒప్పుకున్నాడు. తనను తాను ‘గే’గా ప్రకటించుకున్న మన్వేంద్ర సింగ్​.. భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా గుర్తింపు పొందారు.

2006లో మన్వేంద్ర స్థానిక వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తాను స్వలింగ సంపర్కుడినని చెప్పాడు. ఆయన స్వలింగ సంపర్కం గురించి బహిరంగంగా మాట్లాడిన భారతదేశంలోని రాజకుటుంబాల్లోనే మొదటివాడు. ఇదేదో గొప్పగా అనిపిస్తుందని అనిపిస్తుంది, కానీ ఆ సమయంలో చాలా రచ్చ జరిగింది. ఇప్పుడు సినిమా షూటింగ్ కోసం తమ హెరిటేజ్ ప్యాలెస్‌ని రిసార్ట్‌గా, స్టూడియోగా మార్చారు. ఆయన ప్యాలెస్‌లో ‘గే’ సెంటర్‌ను ప్రారంభించారు.

CI Nageshwar Rao : రాచకొండ పోలీసులను బురిడీ కొట్టిన నాగేశ్వర్ రావు

స్వలింగ సంపర్కుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారు మన్వేంద్ర సింగ్. రాజ్​పిప్లాలో స్వలింగ సంపర్కుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అమెరికా రచయిత జనేత్​ పేరును పెట్టారు. ఈ ఆశ్రమం ఆసియా ఖండంలోనే మొట్టమొదటిది స్వలింగ సంపర్కుల ఆశ్రమంగా పేరొందింది. ఈ ఆశ్రమం కోసం జనేత్.. అన్ని విధాలుగా సాయం చేశారని, అందుకే ఆమె పేరు మీదుగా ఆశ్రమం నెలకొల్పినట్లు సింగ్ తెలిపారు. స్వలింగ్ సంపర్కులకు ఆశ్రమాన్ని నిర్మించాలనే ఆలోచన 2009లో వచ్చిందని మానవేంద్ర సింగ్ తెలిపారు. ఈ ఆశ్రమాన్ని ప్రారంభించడానికి జనేత్ సోదరి కార్ల్​ఫైన్​ తన భర్తతో కలిసి అమెరికా నుంచి వచ్చారు.

 

వివాహ ధ్రువీకరణ పత్రం

ధ్రువీకరణ పత్రాన్ని చూపిస్తున్న యువరాజు