Greenland: డెన్మార్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్ ద్వీపాన్ని బల ప్రయోగంతో సొంత చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రీన్‌ల్యాండ్‌ను తమకు అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామని హెచ్చరికలు చేశారు. గ్రీన్‌ల్యాండ్ తమ భద్రతకు కీలకమని యూఎస్ వాదిస్తోంది. ఇదిలా ఉంటే, వైట్ హౌజ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ట్రంప్ సహాయకుడు స్టీఫెన్ మిల్లర్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గ్రీన్‌ల్యాండ్ వ్యూహాత్మక స్థానమని, డెన్మార్క్ కంట్రోల్ చేయలేదని చెప్పారు.
Read Also: Karumuru Venkat Reddy: నువ్వుమైనా సుప్పిని శుద్దపూసవా.. రాధాకృష్ణ రాతలపై కారుమూరు సీరియస్..!
‘‘గ్రీన్‌ల్యాండ్ అమెరికా ఖండంలో నాలుగో వంతు పరిమాణం. డెన్మార్క్ చాలా చిన్న దేశం. అది చిన్న ఆర్థిక వ్యవస్థ, చిన్న సైన్యం కలిగి ఉంది. వారు గ్రీన్‌ల్యాండ్‌ను రక్షించలేరు. వారు గ్రీన్ ల్యాండ్ భూభాగాన్ని నియంత్రించలేరు’’ అని మిల్లర్ అన్నారు. అంతర్జాతీయ పోటీకి తదుపరి వేదిక ఆర్కిటిక్ అని ఆయన అన్నారు. ధ్రువ ప్రాంతంలో కదలికల్ని, నావిగేషన్, ప్రయాణ మార్గాలను నియంత్రించడానికి యూఎస్ ప్రత్యర్థులు ఎక్కువగా వనరుల్ని ఖర్చు చేస్తున్నారని అన్నారు. ‘‘ఒక భూభాగాన్ని నియంత్రించడానికి, మీరు దానిని రక్షించగలగాలి, దానిని మెరుగుపరచగలగాలి. అక్కడ నివసించగలగాలి’’ కానీ డెన్మార్క్ ఈ పరీక్షల్లో విఫలమైందని అన్నారు.
డెన్మార్క్‌ను రక్షించడానికి నాటో మిత్రదేశంగా అమెరికా ఇప్పటికే వందల బిలియన్ డాలర్లను భరిస్తోందని మిల్లర్ చెప్పుకొచ్చారు. గ్రీన్‌ల్యాండ్‌ను దక్కించుకోవడానికి దాని వ్యూహాత్మక స్థానం, ఖనిజ సంపదను రెండింటిని ప్రస్తావిస్తూ, సైనిక చర్యను తోసిపుచ్చలేదు. గ్రీన్ ల్యాండ్ భవిష్యత్తుపై ఎవరూ అమెరికాతో సైనికంగా పోరాడబోరు అని మిల్లర్ అన్నారు. మరోవైపు, డెన్మార్క్‌తో పాటు పలు యూరప్ దేశాలు గ్రీన్‌ల్యాండ్‌కు తమ సైనిక బలగాలను పంపించాయి.
