Site icon NTV Telugu

కొత్త చ‌ట్టంః అక్క‌డ మ‌హిళ ఎంత‌మందినైనా పెళ్లాడొచ్చ‌ట‌…

ప్ర‌పంచంలో ఉదార‌వాద రాజ్యాంగం, చ‌ట్టాలు ఉన్న దేశాల్లో ద‌క్షిణాఫ్రికా ఒక‌టి. ఈ దేశంలో ఇప్ప‌టికే బ‌హుభార్య‌త్వం అమ‌లులో ఉన్నది.  ఇక్క‌డ ఒక వ్య‌క్తి ఎంత‌మంది మ‌హిళ‌ల‌నైనా వివాహం చేసుకోవ‌చ్చు.  దీంతో దేశంలో చాలామంది పురుషులు ఒక‌రి కంటే ఎక్క‌వ మంది భార్య‌ల‌ను వివాహం చేసుకున్నారు.  అయితే, ఈ దేశంలో మ‌రో చ‌ట్టాన్ని కూడా అమ‌లులోకి తీసుకొచ్చేందుకు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తున్న‌ది.  ఒక మ‌హిళ ఎంత‌మంది పురుషుల‌నైనా వివాహం చేసుకునే విధంగా చ‌ట్టాన్ని తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు మొద‌లుపెట్టింది.  

Read: వ్యాక్సినేషన్ పూర్తయితే మాస్క్ అవసరం లేదా ?

దీనిని గ్రీన్ పేప‌ర్ పేరుతో చ‌ట్టాన్ని తీసుకురాబోతున్నారు.  అయితే, కొన్ని సంస్థ‌లు ప్ర‌భుత్వం తీసుకురాబోతున్న ఈ చ‌ట్టాన్ని వ్య‌తిరేకిస్తున్నాయి.  ఒక మ‌హిళ ఎంతమంది పురుషుల‌నైనా వివాహం చేసుకునే అవ‌కాశం ఉంటే, ఆమెకు పుట్టే బిడ్డ‌కు తండ్రి ఎవ‌రో తెలుసుకోవ‌డం క‌ష్టం అవుతుంద‌ని, డిఎన్ఏ టెస్టులు చేయాల్సి వ‌స్తుందని కొన్ని సంస్థ‌లు చెబుతున్నాయి.  దేశంలో బ‌హుభార్య‌త్వం ఉన్న‌ప్పుడు, బ‌హుభ‌ర్తృత్వం ఎందుకు ఉండ‌కూడ‌ద‌ని ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు. 

Exit mobile version