Site icon NTV Telugu

Google Doodle: మహిళా నీకు వందనం.. ప్రత్యేక డూడుల్‌తో గూగుల్ శుభాకాంక్షలు..

Google

Google

Google Doodle: మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దిగ్గజ సెర్చ్ ఇంజన్ గూగుల్ మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. మహిళా దినోత్సవాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రతిబింబిచేలా గూగుల్ డూడుల్ ను రూపొందించింది. మహిళలు తమ దైనందిక జీవితంలో వారు పోషించే పాత్రను ఈ డూడుల్ లో అద్భుతంగా తెలియజేసింది గూగుల్.

Read Also: India wheat To Afghanista: ఆఫ్ఘన్‌కు 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమలు.. ఉదారత చాటుకున్న భారత్

ఈ డూడుల్ లో మహిళలు వారి హక్కుల కోసం పోరాడటం, సైన్స్, వైద్య రంగాల్లో మహిళ పాత్ర, ఓ తల్లిగా ఆమె బాధ్యతలను నిర్వర్తిస్తుండటం డూడుల్ లో చూడవచ్చు. ఈ డూడుల్ థీమ్ లక్ష్యం మహిళలకు మద్దతు ఇవ్వడమని, నా జీవితంలో ఇతర మహిళలు నాకు మద్దతు ఇచ్చిన అన్ని మార్గాలను ప్రతిబింబిస్తూ చాలా సమయం గడిపానని ఈ డూడుల్ ను రూపొందించిన కళాకారిణి అలిస్సా వినాన్స్ అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా మహిళా సాధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తించేందుకు, వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Exit mobile version