NTV Telugu Site icon

Play Store Settlement: గూగుల్ సంచలన నిర్ణయం.. వినియోదారులకు రూ. 5200 కోట్లు చెల్లింపు..!

Google Pay Store

Google Pay Store

Google To Pay Rs 5200 Crore to US consumers: గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్ సెటిల్‌మెంట్‌లో భాగంగా అమెరికా వినియోగదారులకు సెటిల్‌మెంట్ ఫండ్ ఇచ్చేందుకు శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో అంగీకరించింది. అనంతరం తాజాగా గూగుల్ ఓ ప్రకటన కూడా ఇచ్చింది. అయితే ఈ పరిష్కారానికి న్యాయమూర్తి తుది అమోదం అవసరం. కాగా ఆండ్రాయిడ్ పరికరాల్లో యాప్‌ల పంపిణీపై చట్టవిరుద్ధమైన ఆంక్షలు విధించి యాప్‌లో లావాదేవీలకు అనవసరమైన రుసుములను విధించింది. దానివల్ల గూగుల్.. వినియోగదారుల నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ఆరోపిస్తూ యూఎస్ యూజర్లు శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు.

Also Read: Vijayawada: విచారణకు ఒకరి బదులు మరొకరు.. డిప్యూటీ మేయర్ భర్తపై జడ్జి ఆగ్రహం

సోమవారం దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. గూగుల్‌ను ప్రశ్నించగా తమ తప్పిదాన్ని గూగుల్ ఒప్పుకుంది. యాంటీట్రస్ట్ సెటిల్మెంట్ నిబంధనల ప్రకారం యూజర్లకు పెనాల్టీ ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించడంతో గూగుల్ అందుకు అంగీకరించింది. ఈ మేరకు గూగుల్ ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ వినియోగదారుల కోసం సెటిల్‌మెంట్ ఫండ్‌గా $630 మిలియన్లు (₹5,200 కోట్లకు పైగా), యూఎస్ రాష్ట్రాలు ఉపయోగించే ఫండ్‌కి $70 మిలియన్లు (₹580 కోట్లకు పైగా) చెల్లించనున్నట్లు వెల్లడించింది. అయితే దీనికి ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి తుది అమోదం రావాల్సి ఉంది.

Also Read: NRI Invitation: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు..