NTV Telugu Site icon

Brazil: బ్రెజిల్‌కి గెస్ట్‌గా వెళ్తే గోల్డ్ చైన్ చోరీ.. భోరున విలపించిన లిసిప్రియా

Brazil

Brazil

బ్రెజిల్‌లో వాతావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం కుటుంబానికి వింతైన పరిస్థితి ఏర్పడింది. బ్రెజిల్ వీధుల్లో నడుచుకుంటూ వస్తుండగా ఆమె తల్లి బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీంతో లిసిప్రియ, ఆమె తల్లి కన్నీటి పర్యంతం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్రెజిల్‌లో జీ20 సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి చైల్డ్ క్లైమేట్ యాక్టివిస్ట్ లిసిప్రియా కంగుజం ఆహ్వానింపబడింది. ఆమె తన తల్లితో కలిసి బ్రెజిల్‌ జీ20 సమ్మిట్‌కు హాజరైంది. రియో డి జెనీరోలో సైకిల్‌పై వచ్చిన ఇద్దరు అబ్బాయిలు తల్లి మెడలోంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో వారు భోరున విలపించారు. రక్షించమని పోలీసులను కోరినా పట్టించుకోలేదని వాపోయింది. వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సహాయం చేయాలంటూ అభ్యర్థించింది. లిసిప్రియాను బ్రిజిల్ ప్రభుత్వం ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ఇలా ఎప్పుడూ జరగలేదని.. తాము నిస్సహాయంగా ఉన్నట్లు పోస్టులో రాసికొచ్చింది. ఏడుస్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఎస్ఐపీబీలో రూ.85,083 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం

‘‘మా అమ్మ బంగారు గొలుసు రియో డి జనీరోలో నడుస్తున్నప్పుడు ఇద్దరు అబ్బాయిలు లాక్కున్నారు. దొంగలు సైకిల్‌పై పారిపోతున్నప్పుడు పోలీసులు కూడా వారిని ఆపడానికి మాకు ఎవరూ సహాయం చేయలేదు. #G20Brazilకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాల్సిందిగా బ్రెజిల్ ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించింది. ఇది ఎప్పుడూ ఊహించలేదు. మేము నిస్సహాయులం. దయచేసి మాకు సహాయం చెయ్యండి.’’ లిసిప్రియా విజ్ఞప్తి చేసింది.

ఇది కూడా చదవండి: Tata Harrier EV: టాటా హారియర్ ఈవీ లాంచ్‌పై క్లారిటీ..

బ్రిజిల్‌లో జరిగిన జీ 20 సదస్సుకు ఆయా దేశాధినేతలు హాజరయ్యారు. ఇందుకోసం ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. అయినా కూడా దొంగలు రెచ్చిపోయారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉన్నా కూడా దోపిడీ జరగడం ఆశ్చర్చం కలిగిస్తోంది. వాస్తవానికి లిసిప్రియాకు అంతా సురక్షితమని సెక్యూరిటీ కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయినా కూడా చోరీ జరగడం నిరాశకు గురి చేసింది.