Site icon NTV Telugu

Giorgia Meloni Uncomfortable: అమెరికా అధ్యక్షుడు బైడెన్ వల్లే ఇటలీ ప్రధాని ఇబ్బంది.. ఎందుకో తెలుసా..?

Meloni

Meloni

Giorgia Meloni Uncomfortable: నాటో సదస్సుకు ముందు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా మెలోనీ అసంతృప్తిగా ఉన్న వీడియో ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వల్లే ఆమె కోపంగా ఉన్నట్లు కనిపించింది. అమెరికా ప్రెసిడెంట్ శిఖరాగ్ర సమావేశానికి ఆలస్యంగా రావడం వల్లే జార్జియా మెలోని అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది. దీని కారణంగా నాటో సదస్సు 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. ఇక, నాటో సదస్సు ఉదయం 10 గంటలకు బదులుగా 10:40 గంటలకు ప్రారంభమైంది. నాటో కార్యక్రమం ఆలస్యం కావడంతో.. జో బైడెన్ సాయంత్రం విలేకరుల సమావేశం కూడా గంట ఆలస్యమైందని వైట్ హౌస్ తెలిపింది.

Read Also: Jangaon Hostel: గోడదూకి 19 మంది విద్యార్థులు జంప్‌.. జనగామ హాస్టల్ లో ఘటన

అయితే, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో కింద ఒక నెటిజన్ షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు.. నాటో సదస్సుకు ముందు జో బైడెన్ ఆలస్యంగా వస్తాడని ఎదురు చూస్తున్నప్పుడు ప్రధాని మెలోని తన కళ్ళు తిప్పుతూ గడియారం వైపు కూడా చూపిస్తూ కనిపించారు.. సహజంగానే అది మెలోనీ యొక్క చికాకు, ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది అని పేర్కొన్నాడు.
అలాగే, జీ7 సమ్మిట్‌లో తన కార్యకలాపాల ద్వారా గతంలో కూడా ఇటలీ ప్రధాని మెలోనీ వార్తల్లో నిలిచింది. జీ7 సమ్మిట్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముందు కూడా ఆమె ఇలాగే చేసింది. ఆ వీడియోలో, మెలోని మాక్రాన్‌తో కరచాలనం చేస్తున్నప్పుడు.. ఆమె అయిష్టంగానే షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు మెలోనీ కళ్లలోని హావభావాలను బట్టి తెలుసుకొచ్చు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version