Giorgia Meloni: జీ 7 సదస్సుకు కూతురితో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్

  • జీ 7 సదస్సుకు కూతురితో హాజరైన మెలోని
  • తల్లి వెనుక నడుచుకుంటూ వచ్చిన కుమార్తె
  • ఆద్యంతం సిగ్గుపడుతూ ఉంది.. ఫొటోలు వైరల్
Giorgia Meloni

Giorgia Meloni

ఫ్రాన్స్ వేదికగా జీ 7 సదస్సు జరుగుతోంది. ఈ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీ సహా ప్రపంచ నేతలంతా హాజరయ్యారు. అగ్ర నేతలంతా కలివిడిగా తిరిగారు. ఇక ఇటలీ ప్రధాని మెలోని మాత్రం ఈసారి స్పెషల్‌గా వచ్చారు. తనతో పాటు కుమార్తెను తీసుకుని వచ్చారు. విమానం దిగుతుండగా తల్లి చాటు బిడ్డలా.. అమ్మ వెనుకనే నడిచింది. సిగ్గు పడుతూ కనిపించింది. అతిథులు ఆహ్వానం పలుకుతున్నప్పుడు కూడా సిగ్గు పడుతూనే కనిపించింది.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. జార్జియా మెలోని ఇప్పటివరకు అధికారికంగా వివాహం చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె సింగిల్‌గా ఉన్నారు. ఇటలీ టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా జియాంబ్రునోతో ఆమె చాలా కాలం రిలేషన్‌లో(సహజీవనం) ఉన్నప్పటికీ.. 2023లో ఇద్దరూ విడిపోయారు. 2014లో మీడియా, రాజకీయ వర్గాల ద్వారా మెలోని-జియాంబ్రునో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. జియాంబ్రునో ఇటలీకి చెందిన మెడియాసెట్ టీవీ ఛానళ్లలో జర్నలిస్టుగా, ప్రెజెంటర్‌గా పనిచేశారు. మెలోని రాజకీయాల్లో ఎదుగుతున్న సమయంలో వీరిద్దరి సంబంధం చాలా కాలం కొనసాగింది. ఈ క్రమంలోనే 2016లో వీరికి గినెవ్రా అనే కుమార్తె జన్మించింది. కుటుంబ విలువలు, మాతృత్వం, క్రమశిక్షణ వంటి అంశాలను మెలోని ఎప్పుడూ తన రాజకీయ గుర్తింపులో భాగంగా చూపించేవారు.

×
×
Ad

2022లో ఆమె పార్టీ ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ అధికారంలోకి వచ్చిన తర్వాత జియాంబ్రునో తరచూ మెలోనితో పబ్లిక్ ఈవెంట్లలో కనిపించేవారు. అయితే 2023 అక్టోబర్‌లో వీరి సంబంధం ఒక్కసారిగా వివాదాల్లోకి వెళ్లింది. జియాంబ్రునోకు సంబంధించిన కొన్ని బ్యాక్‌స్టేజ్ వీడియోలు ఇటలీ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో మహిళా సహచరులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు బయటపడటంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఆ తర్వాత మెలోని సోషల్ మీడియాలో అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. ‘‘మా మార్గాలు కొంతకాలంగా వేర్వేరుగా మారాయి’’ అని పేర్కొంటూ.. తన ప్రధాన బాధ్యత తమ కుమార్తెను రక్షించడమేనని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నతనంలో తన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయిన విషయాన్ని కూడా మెలోని గుర్తుచేసుకున్నారు.