అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైట్‌హౌజ్‌లోని ఓవర్ ఆఫీస్ వేదికగా జరిగిన ఇరువురు నేతల భేటీలో వాగ్వాదం, అంతర్జాతీయ మీడియా ముందే జరిగింది. ఇద్దరు నేతలు ఒకరి మాటలకు మరొకరు అరుచుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉక్రెయిన్, అమెరికా మధ్య కీలకంగా భావిస్తున్న ‘‘ఖనిజ ఒప్పందం’’ జరగకుండానే జెలెన్స్కీ వెనుదిరిగారు. ఖనిజ ఒప్పందంతో పాటు రష్యా నుంచి తమ రక్షణకు మద్దతు ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు గట్టిగానే డిమాండ్ చేశారు.
ఈ భేటీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. ఉమ్మడి ప్రకటన జారీ చేయలేదు. వాగ్వాదం నేపథ్యంలో జెలెన్స్కీ ప్రతినిధి బృందాన్ని వైట్ హౌజ్ నుంచి బయలుదేరమని కోరినట్లు సమచారం. మరోవైపు, తమను అవమానపరిచారని ట్రంప్ జెలెన్స్కీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు అగౌరపరిచేవాడిగా అభివర్ణిస్తూ, ఆయనకు శాంతి పట్ల నిబద్ధతను ప్రశ్నించారు.
ఈ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. మీరు 3వ ప్రపంచ యుద్ధంతో ఆటలాడుతున్నారని కఠినంగా మాట్లాడారు. మరోవైపు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాట్లాడుతూ.. శాంతికి దౌత్యమే మార్గమని చెప్పారు, దీనికి జెలెన్స్కీ మాట్లాడుతూ.. మీరు ఎలాంటి దౌత్యం గురించి మాట్లాడుతున్నారు, మీ ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. ఇలా ట్రంప్, జేడీ వాన్స్ జెలెన్స్కీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Tech Tips: ఫోన్‌లో ఇన్‌కాగ్నిటో ట్యాబ్ లాక్ చేయాలనుకుంటున్నారా?.. ఇలా చేయండి!
ఇది జెలెన్స్కీకి 5వ వైట్ హౌజ్ పర్యటన, ట్రంప్ వచ్చిన తర్వాత మొదటిది. ట్రంప్ – జెలెన్స్కీ వాగ్వాదం తర్వాత ఉక్రెయిన్ ప్రతినిధి బృందాన్ని వైట్ హౌజ్ నుంచి వెళ్లిపోవాలని కోరినట్లు తెలిసింది. ట్రంప్, జెలెన్స్కీ వారి ప్రతినిధుల మధ్య డిన్నర్ జరగాల్సి ఉంది. అయితే, ఈ వాగ్వాదంతో చర్చలు అర్ధాంతరంగా ముగియడంతో క్యాబినెట్ గదిలోని సలాడ్ ప్లేట్లు, భోజన వస్తువుల్ని తొలగించారు. భేటీ తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో..‘‘అమెరికా ఉంటే జెలెన్స్కీ శాంతికి సిద్ధంగా లేరు ’’ అని కామెంట్ చేశారు. అతను ఓవర్ కార్యాలయంలో అమెరికాను అగౌరపరిచారంటూ మండిపడ్డారు.
మరోవైపు, భేటీ తర్వాత అమెరికా ప్రజలకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. భద్రతా హమీ లభించేంత వరకు ఉక్రెయిన్ రష్యాతో శాంతి చర్చల్లోకి వెళ్లడని జెలెన్స్కీ చెప్పారు. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ముఖ్యం ఈయూ, యూరప్ దేశాల్లో చాలా మంది జెలెన్స్కీకి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ట్రంప్ కరెక్ట్ అని మద్దతు ప్రకటిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌కి మద్దతు ఉంటుందని చెప్పారు. ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ కూడా జెలెన్స్కీకి మద్దతు ప్రకటించారు. మరోవైపు, రష్యా నేతలు జెలెన్క్కీ తీరుపై మండిపడ్డారు. ట్రంప్, జేడీ వాన్స్ జెలెన్స్కీని కొట్టకుండా సంయమనం పాటించారని అన్నారు.