Site icon NTV Telugu

30 ఏళ్లలోపు వారు ఆ టీకా మాత్రమే వేసుకోవాలి.. సర్కార్‌ కొత్త ఆదేశాలు..!

Covid Vaccine

Covid Vaccine

కరోనా మహమ్మారిపై పోరాటానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. దీంతో.. ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాక్సిన్లను వాడుతున్నారు.. కొన్ని దేశాల్లో మూడు, నాలుగు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే.. మరికొన్ని దేశాల్లో ఒకటి, రెండు మాత్రమే అందుతున్నాయి.. అయితే, వ్యాక్సినేషన్‌పై జర్మనీ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది… 30 ఏళ్ల లోపు ఉన్నవారు కేవ‌లం ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ టీకాల‌ను మాత్రమే వేయించుకోవాలని స్పష్టం చేసింది…

Read Also: మద్యంపై పన్ను రేట్లు సవరణ.. ఉత్తర్వులు జారీ.. కొత్త ధరలు ఇలా..!

ఆ దేశ అడ్వైజ‌రీ క‌మిటీ చేసిన ప్రతిపాద‌న‌ల మేరుకు కొత్త ఆదేశాలను జారీ చేసింది జర్మనీ ప్రభుత్వం.. కాగా, అక్కడ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడెర్నా వ్యాక్సిన్‌తో పోలిస్తే, ఫైజ‌ర్ టీకాతో యువ‌తలో త‌క్కువ స్థాయిలో గుండె కండ‌రాల్లో వాపు స‌మ‌స్యలు తలెత్తుతున్నట్టు గుర్తించారు వైద్య నిపుణులు.. దీనిపై అడ్వైజరీ కమిటీ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది.. ఈ నేప‌థ్యంలో 30 ఏళ్ల లోపు ఉన్నవారు ఫైజ‌ర్ టీకా తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది సర్కార్. అంతే కాదు.. గ‌ర్భిణులు కూడా కేవ‌లం ఫైజ‌ర్ టీకాను మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది.

Exit mobile version