NTV Telugu Site icon

German: రాకెట్ ప్రయోగం విఫలం.. ఎగిరిన 40 సెకన్లలోనే భారీ విస్ఫోటనం

German

German

జర్మన్ స్టార్టప్ ఇసార్ ఏరోస్పేస్ ప్రయోగించిన తొలి రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఆదిలోనే హంసపాదు ఎదురైంది. స్పేస్‌ సెంటర్‌ నుంచి పైకి ఎగిరిన 18 సెకన్లలోనే ప్రయోగం విఫలమైంది. తిరిగి 40 సెకన్లలోనే నేల కూలిపోయింది. ఈ సందర్భంగా భారీ విస్ఫోటనం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విఫలం నుంచి ఒక పాఠం నేర్చుకుంటున్నట్లు ఇసార్ ఏర్‌స్పేస్ తెలిపింది. ప్రయోగంపై ముందుగానే అనుమానాలు వ్యక్తం చేయడం విశేషం.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: అందుకే చంద్రబాబుకి మద్దతు ఇచ్చాను.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇసార్ ఏరోస్పేస్ సొంత సామర్థ్యంతో మానవరహిత స్పెక్ట్రమ్ రాకెట్‌ ప్రయోగానికి పూనుకుంది. మెట్రిక్ టన్ను బరువున్న చిన్న, మధ్య తరహా ఉపగ్రహాలతో ఈ రాకెట్ రూపొందించబడింది. ఆదివారం నార్వేజియన్ అంతరిక్ష నౌకాశ్రయం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే టేకాఫ్ అయిన 40 సెకన్లకే నేలపై పడి పేలిపోయింది. అయితే దీన్ని ప్రారంభ పరీక్ష స్పేస్ సెంటర్ తెలిపింది. తొలి ప్రయత్నం విఫలం అయినా.. ఒక పాఠం నేర్పిస్తున్నట్లు పేర్కొంది.