Site icon NTV Telugu

Pilots Strike: పైలట్ల సమ్మె.. 800 విమానాలను రద్దు చేసిన జర్మనీ విమానయాన సంస్థ

German Airline Lufthansa

German Airline Lufthansa

Pilots Strike: జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సా శుక్రవారం నాడు 800 విమానాలను ప్యాసింజర్, కార్గో విమానాలను రద్దు చేసింది. పైలట్ల సమ్మె కారణంగా ఈ రోజు ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ విమానాశ్రయాలకు వెళ్లే, బయలుదేరే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. ఇది 130,000 మంది ప్రయాణికులపై ప్రభావం చూపుతుందని గురువారం లుఫ్తాన్సా గ్రూప్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. జీతాల పెంపును డిమాండ్‌ చేస్తూ పైలెట్ల యూనియన్‌ శుక్రవారం విధులు బహిష్కరించాలని నిర్ణయించింది. లుఫ్తాన్సా పైలెట్లు ఈ ఏడాది 5.5 శాతం మేర జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు యాజమాన్యం ఒప్పుకోలేదు. సీనియర్‌ పైలెట్లకు 900 యూరోలు అంటే 5 శాతం, కొత్త ఉద్యోగులకు 18 శాతం మేర జీతాలు పెంచుతామని తెలిపింది. ఈ ఆఫర్‌ను పైలెట్ల యూనియన్‌ నిరాకరించడంతో సమ్మె అనివార్యమైంది.

India’s Good News to World: ప్రపంచానికి ఇండియా ‘తీపి’ కబురు

దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్‌కు వెళ్లాల్సిన రెండు లుఫ్తాన్సా విమానాలను సంస్థ రద్దు చేసింది. దీంతో సుమారు 150 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వారి తరఫున వచ్చిన బంధువులు.. శుక్రవారం తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో డిపార్చర్ గేట్ నం.1, టెర్మినల్ 3, ఎయిర్‌పోర్టు ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనలు చేపట్టారు. టికెట్ల డబ్బును వాపసు చేయాలని, లేదా తమ బంధువులకు ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు దిగడం వల్ల ట్రాఫిక్​ సమస్య తలెత్తింది. దీంతో సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికుల బంధువులను అక్కడి నుంచి పంపేశారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

Exit mobile version