Pilots Strike: పైలట్ల సమ్మె.. 800 విమానాలను రద్దు చేసిన జర్మనీ విమానయాన సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pilots Strike: జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సా శుక్రవారం నాడు 800 విమానాలను ప్యాసింజర్, కార్గో విమానాలను రద్దు చేసింది. పైలట్ల సమ్మె కారణంగా ఈ రోజు ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ విమానాశ్రయాలకు వెళ్లే, బయలుదేరే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. ఇది 130,000 మంది ప్రయాణికులపై ప్రభావం చూపుతుందని గురువారం లుఫ్తాన్సా గ్రూప్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. జీతాల పెంపును డిమాండ్ చేస్తూ పైలెట్ల యూనియన్ శుక్రవారం విధులు బహిష్కరించాలని నిర్ణయించింది. లుఫ్తాన్సా పైలెట్లు ఈ ఏడాది 5.5 శాతం మేర జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు యాజమాన్యం ఒప్పుకోలేదు. సీనియర్ పైలెట్లకు 900 యూరోలు అంటే 5 శాతం, కొత్త ఉద్యోగులకు 18 శాతం మేర జీతాలు పెంచుతామని తెలిపింది. ఈ ఆఫర్‌ను పైలెట్ల యూనియన్ నిరాకరించడంతో సమ్మె అనివార్యమైంది.
India’s Good News to World: ప్రపంచానికి ఇండియా ‘తీపి’ కబురు
Also Read
- US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. "నిఘా"పై పెంటగాన్ హెచ్చరిక..
- Vladimir Putin: "భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్‌కు వెళ్లాల్సిన రెండు లుఫ్తాన్సా విమానాలను సంస్థ రద్దు చేసింది. దీంతో సుమారు 150 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వారి తరఫున వచ్చిన బంధువులు.. శుక్రవారం తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో డిపార్చర్ గేట్ నం.1, టెర్మినల్ 3, ఎయిర్‌పోర్టు ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనలు చేపట్టారు. టికెట్ల డబ్బును వాపసు చేయాలని, లేదా తమ బంధువులకు ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు దిగడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికుల బంధువులను అక్కడి నుంచి పంపేశారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!