NTV Telugu Site icon

Sri Lanka Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభం.. గ్యాస్‌ ధర రూ.5,500కి పెంపు

Sri Lanka

Sri Lanka

శ్రీలంకలో సంక్షోభం మరింత ముదిరింది. ఒకవైపు పెరుగుతున్న. ఆహార ధరలు… మరోవైపు ఆందోళన నడుమ శ్రీలంక వాసులు తల్లిడిల్లిపోతున్నారు. ఎప్పుడూ ఎమీ జరుగుతోంది అర్థం కాని అయోమయాపరిస్దితిల్లో బతుకుతున్నారు.. నెలరోజులుగా రోడ్డెక్కి నినదిస్తున్న శ్రీలంక ప్రజల ఆందోళన హింసాత్మకంగా మారుతున్నాయి. దీనికి కారణం ఆందోళనకారులను బలప్రయోగంతో అణచివేయాలని అక్కడి ప్రభుత్వం భావించడమేనని అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు రోజుల క్రితం లంక రాజధాని కొలంబో సమీపంలోని రాంబక్కన్ పట్టణంలో ప్రజలు నిర్వహిస్తున్న ఆందోళనలో హింస చోటుచేసుకుంది. పెరిగి పెట్రోలు, డీజల్ ధరలపై నిరసనగా భారీ ఎత్తున రోడ్డెక్కిన ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు, మిలటరీ ప్రయత్నించడంతో ఉద్యమకారులు రెచ్చిపోయారు. ఇక, తాజాగా శ్రీలంక పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. లంక ప్రభుత్వం అధీనంలో గల సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఒక్క రోజే లీటరు పెట్రోల్‌పై 84 రూపాయల భారం మోపింది. ప్రస్తుతం లంకలో లీటరు పెట్రోల్‌ ధర 338 రూపాయలుగా ఉంది. సూపర్‌ డీజిల్‌ ధర ఒక్క రోజే 75 రూపాయలు పెరిగి… 329 రూపాయలయ్యింది. ఇక ఆటోలకు ఉపయోగించే డీజిల్‌ ధర 113 రూపాయలు పెరిగి 289 రూపాయలకు చేరింది. ఇక, పెట్రోల్, డీజల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి..బియ్యం ధర 30 శాతం పెరిగింది.. దీంతో మార్కెట్‌లో కిలో బియ్యం ధర ప్రస్తుతం 440కు చేరింది.. కిలో కందిప్పు 600 క్రాస్‌ చేయగా.. అసలు మార్కెట్‌లో పాల పౌడర్‌ దొరకని పరిస్థితి.

Read also: Vijayasai Reddy: జగన్‌ ఆదేశాలే శిరోధార్యం.. ఇది కావాలనే ప్రస్తావన రాకూడదు..!

ఇక, సిటీ బస్సుల్లో టికెట్ల ధరలు యాబై శాతం పెంచేశారు.. మినిమం బస్సు ఛార్జీ .50 రూపాయలుగా చేవారు.. 20-40 రూపాయలకు దొరికే బ్రెడ్‌ ప్యాకేట్ ఏకంగా 230 పలుకుతోంది.. దీంతో, పెరిగిన పెట్రోల్ ధరలపై గల్లాఫేస్ రోడ్డు వద్ద లంకవాసుల ఆందోళనలు చేస్తున్నారు.. అది మరచిపోకుముందే ఇప్పుడు 12 కేజీల గ్యాస్ బండ ధరను 2700 రూపాయిల నుండి రూ.5,500 వరకు పెంచింది.. లంకలో ప్రస్తుతం పదిరోజుకు ఒకసారి మాత్రం గ్యాస్ సరఫరా చేస్తోంది అక్కడి గ్యాస్ ఏజెన్సీలు.. దీంతో ఇటు ఎమీ కోనలేక.. కొన్ని వండుకోవటానికి గ్యాస్ లేక నరకయాతన అనుభవిస్తూన్నారు లంక వాసులు.. రారాన్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయాని నిపుణులు అంచాన వేస్తున్నారు. మరోవైపు, శ్రీలంక అధ్యక్షుడి అధికారాలకు కోత పెడతామంటున్నారు ప్రధాని మహింద రాజపక్సే. పార్లమెంట్‌కు మరింత సాధికారత కల్పిస్తామంటున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది శ్రీలంక. ఈ పరిస్థితికి రాజపక్సే కుటుంబ సభ్యులే కారణమంటూ ఆందోళనలు చేస్తున్నారు జనం. ముఖ్యంగా అధ్యక్షుడు గొటబాయ్‌ రాజపక్సే గద్దె దిగాలని డిమాండ్‌ చేస్తున్నారు జనం. అలాగే, రాజపక్సే కుటుంబ సభ్యులు పలువురు కీలక పదవుల్లో ఉన్నారు. దీంతో వీళ్లంతా దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడుతున్నారు.