NTV Telugu Site icon

Gangster Goldy Brar: సిద్ధూమూసేవాలా హత్య సూత్రధారి, గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ హతం.?

Gangster Goldy Brar

Gangster Goldy Brar

Gangster Goldy Brar: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మసేవాలా హత్య కేసులో కీలక సూత్రధారిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి గ్యాంగ్ డల్లా లఖ్‌బీర్ ముఠా సభ్యులు కాల్చి చంపినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా కాలిఫోర్నియాలో గోల్డీ బ్రార్‌ని హతమార్చినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Read Also: Gangster Goldy Brar: సిద్ధూమూసేవాలా హత్య సూత్రధారి, గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ హతం.?

ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం.. కాలిఫోర్నియాలోని హోటల్ ఫెయిర్‌మౌంట్‌లో బ్రార్ కాల్చి చంపబడ్డారని తెలుస్తోంది. చాలా కాలంగా ఇతను కెనడాలో ఉన్నట్లు భావిస్తున్నారు. కెనడాలోని 25 మంది మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడు. పంజాబీ సింగ్ సిద్ధూ మూసేవాలాని మే 29, 2022న హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా గోల్డీ బ్రార్ పేరు ప్రచారంలోకి వచ్చింది. బ్రార్ మార్గనిర్దేశంతోనే మూసేవాలా హత్య జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ అసలు పేరు సతీందర్‌జీత్ సింగ్. ఇతను పంజాబ్ డిపార్ట్మెంట్‌లో పనిచేసిన మాజీ పోలీస్ కుమారుడు. పంజాబ్‌లోని స్థానిక గ్యాంగ్‌లతో కలిసి పనిచేసి, తన నేర చరిత్రను ప్రారంభించారు. పెద్ద పెద్ద నేరాలు చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత కెనడా పారిపోయాడు. హత్యలు, అక్రమ ఆయుధాల సరఫరా చేయడం వంటి నేరాల్లో పాల్గొన్న కారణంగా కెనడా ఇతడిని మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది.

Show comments