ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు ఆక్రమణల తరువాత జరుగుతున్న పరిణామాలను ప్రపంచదేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే కాబూల్‌లోని రాయబార కార్యాలయాలను అనేక దేశాలు మూసేశాయి. తాలిబన్లు శాంతియుతంగా పరిపాలన అందిస్తామని చెబుతూనే అక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్ దేశాలు కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం అవుతున్నాయి. వచ్చే వారం జీ 7 దేశాలు సమావేశమయ్యి ఆఫ్ఘన్ పరిస్తితులపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని పౌరుల రక్షణకు మానవతా దృక్పధంలో ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా, బ్రిటన్‌ను పేర్కొన్నాయి. ఖతర్, కువైట్ దేశాలతో అమెరికా, బ్రిటన్ దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలపై జీ 7 కీలక నిర్ణయం…
