NTV Telugu Site icon

12వ రౌండ్‌ చర్చలకు సిద్ధమైన భారత్‌-చైనా..

India and China

India and China

భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.. అయినా.. సరిహద్దుల్లో.. నిర్మాణాలు, బలగాల మోహరింపు.. దీనికి ధీటుగా భారత్‌ స్పందించడం.. ఇలా వ్యవహారం సాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో 12వ రౌండ్‌ చర్చలకు సిద్ధమయ్యాయి భారత్‌-చైనా.. ఈ నెల 31వ తేదీన ఈ సమావేశం జరగనుంది.. ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయిలో జరుగనున్న ఈ సమావేశంలో గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, డెప్సాంగ్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై చర్చించనున్నారు. సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తలను అంతం చేయడానికి భారతదేశం-చైనా సైనిక అధికారుల 12వ రౌండ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు… కాగా, ఈ సమావేశం ఈరోజే నిర్వహించేందుకు చైనా అంగీకరించింది.. కానీ, కార్గిల్ విజయ్ దివాస్ కారణంగా సమావేశాన్ని వేరే రోజున నిర్వహించాలన్న భారత్‌ విజ్ఞప్తికి ఓకే చెప్పింది డ్రాగన్ కంట్రీ.. దీంతో ఈనెల 31వ తేదీన భారత్‌-చైనా మధ్య కార్ప్స్‌ కమాండర్‌ స్థాయిలో చర్చలు జరపనున్నారు.