కరోనా మహమ్మారి చాలా దేశాల కంటిపై కునుకు లేకుండా చేసింది.. ఏ దేశంలో గణాంకాలు పరిశీలించిన.. భారీగా కేసులు, పెద్ద సంఖ్యలో మృతుల సంఖ్య కలవరపెట్టింది.. ఇక, ఫ్రాన్స్‌ను కూడా అతలాకుతలం చేసింది కోవిడ్.. అయితే, ఇప్పుడు క్రమంగా అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది.. కేసులు తగ్గిపోయాయి.. మరోవైపు వ్యాక్సినేషన్ కూడా పుంజుకుంది… దీంతో.. కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రాన్స్.. ఈ నెల 20వ తేదీ నుంచి రాత్రికర్ఫ్యూను సడలించాలనే నిర్ణయానికి వచ్చింది. అంతేకాదు, ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం కూడా తప్పనిసరి కాదని ప్రకటించారు… కాగా, ఫ్రాన్స్‌లో రాత్రికర్ఫ్యూతోపాటు బయటికొస్తే మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన ఉంది.. గత ఏడాది నుంచి ఈ నిబంధనలు అమలులో ఉన్నాయి.. మరోవైపు ఇక నుంచి రాత్రి కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి అమల్లోకి రానుంది. కాగా, భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.
ఇక మాస్క్‌లు అవసరంలేదు.. సర్కార్ నిర్ణయం.. ఎక్కడంటే..?
France