France: ఫ్రాన్స్‌లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- ఫ్రాన్స్‌లో ఎండలు భగభగ
- ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూరప్ దేశాల్లో ఎండలు భగభగ మండిపోతున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, యూకేలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం నుంచే తీవ్రమైన ఉక్కపోత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. దాదాపు 36-42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఎండివేడిమి కారణంగా ఇప్పటి వరకు 18 మంది చనిపోయారు.

Also Read
భరించలేని ఎండల కారణంగా ప్రజలు ఎయిర్ కండీషనర్ల కోసం దుకాణాలకు పోటెత్తుతున్నారు. తాజాగా చాంబెరీ నగరంలోని ఓ స్టోర్‌లో దుకాణం తెరిచిన వెంటనే ఏసీలు, కూలింగ్ పరికరాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో స్టోర్ తలుపులు తెరవగానే వినియోగదారులు ఏసీలు, ఇతర కూలింగ్ పరికరాల వైపు పరుగులు తీస్తూ కనిపించారు. కొందరు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లగా.. మరికొందరు కూలింగ్ పరికరాలను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దృశ్యాలను చూసిన ఇతర కస్టమర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా ఫ్రాన్స్‌లో ఇలాంటి తీవ్ర ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతుండటంతో.. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. “ఫ్రాన్స్‌లో కూడా ఏసీల కోసం ఇలా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందా?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం యూరప్‌లోని పలు దేశాలను తీవ్ర హీట్‌వేవ్ వణికిస్తోంది. ముఖ్యంగా ఫ్రాన్స్ అత్యంత తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్న దేశాల్లో ఒకటిగా మారింది. ఈ వారం పారిస్‌లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. 1872 నుంచి 2019 వరకు నమోదైన మొత్తం రోజుల కంటే ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ అసాధారణ ఉష్ణోగ్రతలకు ‘హీట్ డోమ్’ (Heat Dome) కారణమని వాతావరణ శాఖ తెలిపింది. అధిక పీడన వ్యవస్థ వేడి గాలిని ఒకేచోట బంధించడం వల్ల ఆకాశం నిర్మలంగా ఉండి.. ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని వివరించింది.
ఫ్రాన్స్‌లో ఈ వారం సగటు ఉష్ణోగ్రత 29.8 డిగ్రీల సెల్సియస్ నమోదై కొత్త రికార్డు సృష్టించింది. ఇదే పరిస్థితి ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో కూడా కొనసాగుతుండగా.. గతంలో అరుదుగా కనిపించిన ఈ తరహా తీవ్ర ఉష్ణోగ్రతలు ఇప్పుడు సాధారణంగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
As record-breaking heat grips parts of France, with temperatures topping 40°C, shoppers have been lining up early to snap up air conditioners and cooling fans. pic.twitter.com/80XdOZqFL0
— Shanghai Daily (@shanghaidaily) June 26, 2026
🔴FRANCE 🇨🇵| VIDEO 🎦|
Amid the unbearable heatwave gripping the country for days, #French people are rushing in supermarkets to buy more fans and air conditioners. Extraordinary scenes of shoving and tension in store aisles right at opening time are circulating on social media. pic.twitter.com/V3S2n6Olua— Nanana365 (@nanana365media) June 26, 2026
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?