Site icon NTV Telugu

Titan: ఒడ్డుకు చేరిన టైటాన్‌ శకలాలు..

Titan

Titan

Titan: టైటానిక్‌ షిప్‌ శిధిలాలను చూడటానికి వెళ్లిన టైటాన్‌ జలాంతర్గామి పేలిపోయిన విషయం తెలిసిందే. అందులో ప్రయాణించిన 5 మంది మరణించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు టైటాన్‌కు చెందిన శకలాలను అట్లాంటిక్‌ మహాసముద్రం అడుగు భాగం నుంచి ఒడ్డుకు చేర్చారు. కెనడాలోని సెయింట్ జోన్స్‌లో హారిజాన్ ఆర్కిటిక్ షిప్‌లో ఈ లోహ శకలాలను ఒడ్డుకు చేర్చినట్టు అధికారులు చెబుతున్నారు. టైటాన్ సబ్‌కు చెందిన లోహ శకలాలు టార్పాలిన్లతో కప్పి ఉండగా వాటిని క్రేన్లతో ట్రక్‌లోకి మార్చారు. టైటాన్ సబ్‌కు చెందిన ల్యాండింగ్ ఫ్రేమ్, వెనుక కవర్ దొరికాయని అమెరికా కోస్ట్ గార్డ్ అధికారులు చెప్పారు. టైటాన్‌కి చెందిన అయిదు భాగాలు టైటానిక్ నౌక ముందు భాగానికి 487 మీటర్ల దూరంలో లభించినట్లు కోస్ట్ గార్డ్ రేర్ అడ్మిరల్ జాన్ మౌగర్ చెప్పారు.

Read also: Attack on US Consulate: యూఎస్‌ కాన్సులేట్‌పై దాడి.. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ఇద్దరు మృతి

మునిగిపోయిన టైటానిక్ షిప్‌ శిథిలాలు చూడ్డానికి అయిదుగురితో అట్లాంటిక్ మహా సముద్ర అడుగు భాగానికి వెళ్లే క్రమంలో టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ పేలిపోయిన విషయం తెలిసిందే. సముద్రం అడుగున్న ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఓషన్ గేట్ సీఈఓ 61 ఏళ్ల స్టాక్టన్ రష్, 48 ఏళ్ల బ్రిటిష్ పాకిస్తానీ వ్యాపారవేత్త షహజాదా దావూద్, 19 ఏళ్ల ఆయన కొడుకు సులేమాన్, 58 ఏళ్ల బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రాన్స్‌కు చెందిన 77 ఏళ్ల హెన్రీ నార్గొలెట్ ఇందులో వెళ్లారు. వెళ్లిన కొద్దిసేపటికే జలాంతర్గామీ పేలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఉలాంతర్గామిలో ప్రయాణించిన అయిదుగురూ ప్రాణాలు కోల్పోయారు. టైటాన్‌తో సంబంధాలు తెగిపోయిన తర్వాత దాని రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న అమెరికా కోస్ట్ గార్డ్‌ సిబ్బందికి అది పేలిపోయినట్లు భారీ శబ్దం వినిపించింది. ఆ తరువాత టైటాన్‌ను కనుగొనడానికి కోస్ట్ గార్డ్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే 5 రోజుల రెస్క్యూ ఆపరేషన్‌ అనంతరం టైటాన్‌ జలాంతర్గామి పేలిపోయినట్టు అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన శకలాలను ఇప్పుడు అధికారులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు.

Exit mobile version