NTV Telugu Site icon

Australia Parliament: ఆస్ట్రేలియా పార్లమెంట్ పైకప్పుపైకి పాలస్తీనా మద్దతుదారులు

Australia Parliament

Australia Parliament

Australia Parliament: పాలస్తీనా అనుకూల మద్దతుదారులు గురువారం ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్ పైకప్పు పైకి ఎక్కారు. ముదురు దుస్తులు ధరించిన నలుగురు వ్యక్తులు ఆస్ట్రేలియా పార్లమెంటు పైకప్పుపైకి ఎక్కి బ్యానర్‌లు కట్టారు. బ్యానర్లలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు ఉన్నాయి. ఆస్ట్రేలియన్ పార్లమెంట్ సభ్యులు ఉల్లంఘనను భద్రతా ప్రమాదంగా ఖండించారు. బ్యానర్లను కట్టడంతో పాటు, పైకప్పుపై నిలబడి ఉన్న ప్రదర్శనకారులలో ఒకరు ఇజ్రాయెల్ ప్రభుత్వంపై మైక్రోఫోన్‌ను వినియోగించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆ వ్యక్తి ఆరోపించారు. “మేము మరచిపోము, క్షమించము, మేము ప్రతిఘటిస్తూనే ఉంటాము” అని నిరసనకారుడు చెప్పాడు. యుద్ధ నేరాల ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది.

Read Also: SCO Summit 2024: ఉగ్రవాదంపై పరోక్షంగా చైనా, పాక్‌ను టార్గెట్‌ చేసిన జైశంకర్‌ .. జిన్‌పింగ్ ఎదుటే!

పోలీసులు, భద్రతా అధికారులు పైకప్పుపై నిలబడి ఉన్న నిరసనకారులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు ప్రదర్శనకారులు బ్యానర్లు తీసుకుని కిందికి దిగారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. పైకప్పుపై బైఠాయించి నిరసన తెలిపిన నలుగురిని అరెస్టు చేశారు. ఆస్ట్రేలియన్ పార్లమెంట్ భవనంలోకి ఎవరూ చొరబడకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, అందుకోసం చాలా ఖర్చు పెట్టామని ప్రతిపక్షాలు తెలిపాయి. ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నిరసనగా అదే రోజున ఆస్ట్రేలియన్ పాలక సెనేటర్ రాజీనామా చేశారు. పాలస్తీనాపై ఆస్ట్రేలియా ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. కాగా, పార్లమెంట్ భవనం పైకప్పుపై ప్రదర్శన చేయడాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఖండించారు. ఇది శాంతియుత నిరసన కాదన్నారు.