NTV Telugu Site icon

Bashar al Assad: సిరియా మాజీ అధ్యక్షుడి పరిస్థితి విషమం.. రష్యాలో విషప్రయోగం!

Basharalassad

Basharalassad

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్(59) పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మాస్కోలో ఆయనపై విషప్రయోగం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తీవ్ర దగ్గుతో పాటు ఊపిరి తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అసద్‌పై తీవ్ర హత్యాయత్నం జరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అయితే అసద్ ఆరోగ్యంపై ఇప్పటి వరకు రష్యా స్పందించలేదు. వైద్య టెస్టుల్లో మాత్రం విషం ఉన్నట్లుగా తేలింది. ప్రస్తుతం ఆయన ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే చికిత్స పొందుతున్నట్లుగా మీడియా తెలిపింది.

ఇది కూడా చదవండి: China New Virus: చైనాలో కొత్త వైరస్.. కరోనా లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి..

ఇటీవల సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. రెబల్స్.. డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో అసద్, కుటుంబంతో కలిసి డిసెంబర్ 8, 2024న రష్యాకు పారిపోయాడు. అక్కడ రాజకీయ శరణార్థిగా ఉంటున్నారు. అయితే అసద్ భార్య అస్మా పరిస్థితి కూడా సీరియస్‌గా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. 50-50 శాతమే ఛాన్స్ ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమె సొంత దేశమైన యూకేకు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. భర్తకు విడాకులు ఇచ్చి.. యూకేకు వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లుగా సామాచారం. ఇంతలోనే అసద్‌పై విషప్రయోగం జరగడం తీవ్ర సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి: Blinkit: అంబులెన్స్ సేవలు ప్రారంభించిన బ్లింకిట్.. కాల్ చేసిన టెన్ మినిట్స్‌లోనే..!

Show comments