తాలిబన్లు.. ఆఫ్ఘనిస్థాను స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు కదులుతూనే ఉన్నారు.. ఓవైపు అరచకాలు సృష్టిస్తూ తాలిబన్లు దూసుకెళ్తుండగా.. వారిని నిలువరించలేక.. సైన్యం సైతం చేతులు ఎత్తేసింది.. చివరకు ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోకి కూడా ఎంట్రీ అయిపోయారు తానిబన్లు.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుత యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల రాజ్యానికి తెరదించి, ఆ దేశాన్ని పునర్నిర్మించడానికి ఈ రెండు దశాబ్దాలలో 2 లక్షల కోట్ల డాలర్లును అమెరికా ఖర్చు చేసిందని.. 2500 మంది అమెరికా సైనికులు మృత్యువాత పడ్డారని ఈ సందర్భంగా గుర్తుచేసుకుని ట్రంప్.. చివరికి ఇంతా చేసి దళాలను ఉపసంహరించుకోవడంతో ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, ఈ పాపం ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌దే నని మండిపడ్డ ఆయన.. ఇప్పటికైనా నన్ను మిస్ అవుతున్నారా..? అంటూ ప్రశ్నించారు.
తాలిబన్ల చేతిలోకి ఆఫ్ఘన్…! డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Donald Trump