Site icon NTV Telugu

Wildfire: హవాయి దాటి వాషింగ్టన్‌ వైపు కార్చిచ్చు

Wildfire

Wildfire

Wildfire: హవాయి దీవులను పూర్తిగా దహించి వేసిన కార్చిచ్చు.. వేగంగా వాషింగ్టన్‌ వైపు కదులుతోంది. వేగంగా వీస్లున్న బలమైన గాలుల కారణంగా కార్చిచ్చు కూడా అంతే వేగంతో వ్యాపిస్తోంది. వేగంగా వ్యాపిస్తున్న కార్చిచ్చు కెనడా, అమెరికా దేశాలను వణికిస్తోంది. కార్చిచ్చు ఉత్తర అమెరికా దేశాలను వణికిస్తోంది. బలమైన గాలుల కారణంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే హవాయి ద్వీపంలో బీభత్సం సృష్టించిన ఈ కార్చిచ్చు.. ఇప్పుడు వాషింగ్టన్‌రాష్ట్రం వైపు దూసుకొస్తోంది. కార్చి్చ్చు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వెంటనే ఖాళీ చేయాలని పలు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వాషింగ్టన్‌లోని స్పోకాన్‌ కౌంటీ సమీపంలో మొదలైన ఈ కార్చిచ్చు కొన్ని గంటల వ్యవధిలోనే 500 నుంచి 3 వేల ఎకరాలకు విస్తరించిందని.. బలమైన గాలులే అందుకు కారణమని వాషింగ్టన్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్‌ ప్రకటించింది. కార్చి్చ్చుతో ఇప్పటికే కొన్ని ఇళ్లు కాలిపోయి ఆస్తినష్టం కూడా సంభవించినట్లు అధికారులు తెలిపారు. కార్చిచ్చు మూలంగా కౌంటీలోని మెడికల్‌ లేక్‌ పట్టణ ప్రజలకు లెవెల్‌ 3 అలర్ట్ జారీ అయింది. వెంటనే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అలర్ట్ ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు.

Read also: Kartikeya : చిరంజీవి గారి పై విమర్శలు చేసే వారిది చిన్న మనస్తత్వం..

కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుండటంతో మెడికల్‌ లేక్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్యులు, రోగులను తరలించేందుకు ప్రభుత్వం నేషనల్ గార్డ్ ట్రూప్స్‌ను రంగంలోకి దింపింది. ఫోర్‌ లేక్స్ పట్టణానికి కూడా లెవెల్‌ 3 ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే స్పోకాన్‌ కౌంటీలోని 13 వేలమంది ప్రజలున్న చెనెయ్‌ నగరానికి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని లెవెల్‌ 2 అలర్ట్ జారీ చేశారు. భారీగా నమోదైన ఉష్ణోగ్రతలతోపాటు వర్షాభావ పరిస్థితులు.. బలమైన గాలులు అగ్నికీలల వ్యాప్తికి కారణమవుతాయని జాతీయ వాతావరణ విభాగం తెలిపింది. కెనడాలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కార్చిచ్చులు వేలాది మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయేట్లు చేస్తున్నాయి. ఈ దేశంలోని నార్త్‌వెస్ట్‌ టెరిటరీస్‌లో 200పైగా కార్చిచ్చులు రాజుకున్నాయి. నార్త్‌ వెస్ట్ టెరిటరీస్‌ రాజధాని ఎల్లోనైఫ్‌లోని 20 వేల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. శుక్రవారం సాయంత్రం నాటికి 48 గంటల్లో 19 వేల మంది నగరాన్ని ఖాళీ చేయించారు.

Exit mobile version