Site icon NTV Telugu

Pakistan Floods: పాకిస్థాన్‌లో ఆకస్మిక వరదలు.. నలుగురు మృతి.. పలువురు గల్లంతు

Pakistan Floods2

Pakistan Floods2

పాకిస్థాన్‌లో ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. గిల్గిట్-బాల్టిస్తాన్‌లోని పర్యాటక కేంద్రం దగ్గర హఠాత్తుగా వరదలు సంభవించాయి. దీంతో ఒక మహిళ సహా నలుగురు పర్యాటకులు మృతిచెందారు. దాదాపు 30 మందికిపైగా వరదల్లో కొట్టుకుపోయారు. భారీ రుతుపవనాలు సందర్భంగా కుండపోతగా వర్షం కురవడంతో ఆకస్మికంగా వరదలు సంభవించాయని మంగళవారం అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: ముప్పు ముందే గుర్తించారా? ధన్‌ఖర్ రాజీనామాపై లాబీల్లో తీవ్ర చర్చోపచర్చలు

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఒక్కసారిగా వరదలు సంభవించడంతో పర్యాటక వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయని ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫరాక్ తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని లోధ్రాన్‌కు చెందిన ఒక మహిళ మృతదేహంతో సహా ఇప్పటివరకు నాలుగు మృతదేహాలు బయటకు తీసినట్లు చెప్పారు. డజన్ల కొద్దీ కొట్టుకుపోయారని.. ఇక గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Supreme Court: బిల్లులపై రాష్ట్రపతికి డెడ్‌లైన్ విధించవచ్చా?, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

ఇక ఆకస్మిక వరదలు కారణంగా రహదారులు ఘోరంగా దెబ్బతిన్నాయి. అలాగే విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. ఇక తాత్కాలిక ఆశ్రయాల్లో పర్యాటకులకు అధికారులు వసతి కల్పిస్తు్న్నారు. దాదాపు ఏడు కిలోమీటర్ల వరకు ఉన్న వాహనాలు కొట్టుకుపోయినట్లు సమాచారం. దాదాపు 30 మంది వరకు పర్యాటకులు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version