కెనడాలోని టొరంటోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు భారతీయ విద్యార్థుల సహా మరో ఇద్దరు గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించామని కెనడాలోని భారత రాయబారి అజయ్ బైసారియా వెల్లడించారు. బాధితుల స్నేహితులతో ఎంబసీ అధికారులు టచ్‌లో ఉన్నారని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు.
కాగా మృతులను హర్‌ప్రీత్ సింగ్, జస్పిందర్ సింగ్, కరన్‌పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్‌గా గుర్తించామని కెనడాలోని పోలీసులు వెల్లడించారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ వ్యాన్ శనివారం తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
