Site icon NTV Telugu

Polio Virus Case in America: అమెరికాలో పోలియో వైరస్‌ కేసు.. న్యూయార్క్ ఆరోగ్య శాఖ వెల్లడి

Another Case Of Polio Virus In America

Another Case Of Polio Virus In America

అమెరికాలో మరోసారి పోలియో వైరస్ కేసు నమోదైంది. గురువారం మాన్‌హాటన్‌ సమీపంలోని ఓ వ్యక్తికి ఈ వైరస్‌ ఉన్నట్టు న్యూయార్క్ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెరికాలో చివరిసారి 2013లో పోలియో వైరస్ కేసు నమోదైంది. సుమారు దశాబ్దకాలం తర్వాత అమెరాకిలో గురువారం తొలిసారి పోలియో వైరస్‌ కేసు రిపోర్ట్‌ కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

వివరాల్లోకి వెలితే.. ఉత్తర మాన్‌హటాన్‌కు 30 మైళ్ల దూరంలో రాక్‌లాండ్ కౌంటీలో జీవిస్తున్న ఓ వ్యక్తికి పోలియో పాజిటివ్ అని తేలిందని న్యూయార్క్ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే.. చివరిసారిగా అమెరికాలో 2013లో పోలియో వైరస్ కనిపించినట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. ఈనేపథ్యంలో.. తాజాగా పోలియో వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. అయితే.. ఓరల్ పోలియో వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిని ఈ పౌరుడికి వైరస్ సోకినట్టుగా సంకేతాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కానీ ఇక్కడు ట్వీస్ట్‌ ఏంటంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ 2000లోనే అమెరికాలో బంద్ చేశారు. అయితే.. అమెరికా పౌరుడికి ఈ వైరస్ దేశం వెలుపల నుంచి సోకి ఉండొచ్చని అధికారులు ప్రాథమిక అభిప్రాయానికి వచ్చారు. పోలియో వైరస్‌ సోకిన వ్యక్తి నివసిస్తున్న ప్రాంతంలో మరిన్ని టెస్టులు చేయాలని.. అంతేకాకుండా.. ఆ ప్రాంతం ప్రజలు ఒక వేళ టీకా వేసుకుని ఉండకపోవేతే, తక్షణమే వేసుకోవాలని ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ఈనేపథ్యంలో.. పోలియో రక్కసిని ప్రపంచంలో నుంచి తరిమేయడానికి ప్రపంచ దేశాలు ఏకం అయ్యాయి. అయితే.. 1988లో ఈ కేసులు భారీగా నమోదయ్యాయి. కాగా.. 125 దేశాలు పోలియోతో తల్లడిల్లాయి. ఈనేపథ్యంలో.. ప్రపంచ దేశాలు అన్ని సంయుక్తంగా చర్యలు తీసుకోవడం మూలంగా 1988 నుంచి పోలిస్తే, ఇప్పుడు 99 శాతం కేసులు తగ్గిపోయాయి. అయితే.. అమెరికాలోనైతే 1950 ల్లోనే కేసులు తగ్గుముఖం పట్టగా.. 60లలో దీనికి టీకా తయారు చేసి, అప్పుడు నాచురల్‌గా సోకిన పోలియో కేసు అమెరికాలో చివరిసారి 1979లో నమోదైంది.

Droupadi Murmu scripts history: చరిత్ర సృష్టించిన ద్రౌపది ముర్ము.. ఓట్లు ఇలా..

Exit mobile version