Site icon NTV Telugu

ఆఫ్ఘన్‌లో భీకర పోరు.. 50 మందికి పైగా తాలిబన్లు హతం..!

ఆఫ్ఘన్‌ రాజధాని కాబూల్‌ను సైతం స్వాధీనం చేసుకున్నాం.. ఇక, మాకు ఎదురేలేదు అని భావిస్తున్న తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది.. ఆఫ్ఘనిస్థాన్‌లోని దక్షిణ ప్రాంతంలోని ఆండ్రాబ్‌ ప్రావిన్స్‌లో తాలిబాన్-ఆఫ్ఘన్ సైన్యం మధ్య భీకర యుద్ధమే నడుస్తోంది… తాలిబన్లు స్వాధీనం చేసుకోని కొన్ని ప్రాంతాల్లో పంజ్‌షీర్ లోయ ఒకటి కాగా.. ఆ ప్రాంతానికి వెళ్లిన తాలిబన్లకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. ఆంధ్రాబ్‌ ప్రావిన్స్‌లో జరిగిన పోరులో ఇప్పటి వరకు 50 మందికి పైగా తాలిబన్ ఫైటర్లు మరణించినట్టుగా తెలుస్తోంది… మరో 20 మందికి పైగా తాలిబన్‌ ఫైటర్లను బందీలు చేశాయి పంజ్‌షీర్ సన్నిహిత వర్గాలు.. ఈ పోరాటంలో తాలిబాన్ ప్రాంతీయ కమాండర్ కూడా ప్రాణాలు వదిలినట్టు తెలుస్తోంది.. ఇక, పంజ్‌షీర్‌కు మద్దతు ఇస్తున్న ఒక ఫైటర్ మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడినట్టుగా సమాచారం.

ఇక, పంజ్‌షీర్ లోయలో తిరుగుబాటుదారులకు నాయకత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్.. అన్ని విధాలుగా యుద్ధానికి సిద్ధం అయ్యారు.. ఆఫ్ఘన్ సైన్యం కూడా వారికి మద్దతు ఇవ్వడం వారికి అదనపు బలం.. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్, నార్తర్న్ అలయన్స్‌కు నాయకత్వం వహిస్తున్న అహ్మద్‌ మసూద్.. ఇప్పటికే యుద్ధానికి సిద్ధం అని ప్రకటించారు.. మరోవైపు చర్చలు కూడా రెడీ అని వెల్లడించారు. మరోవైపు తాలిబన్‌ ఫైటర్లు పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను చుట్టుముట్టారు. మరింత భీకర పోరు జరిగే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. చర్చలకు కూడా అవకాశం ఉందని చెబుతున్నారు.

Exit mobile version