వన్ నైట్ స్టాండ్ అంటే అందరికీ తెలిసిన విషయమే. సింగిల్‌గా ఉండేవారు ఒక్కసారైనా లైంగిక సుఖం అనుభవించాలని భావిస్తారు. వీరిలో చాలామంది తమతో సెక్స్ చేసే వ్యక్తి ఎలాంటి పరిచయం లేనివారై ఉండాలని కోరుకుంటారు. లైంగిక సుఖఱం పొందిన తర్వాత వారితో ఎలాంటి సంబంధం కొనసాగించకూడదని ఆకాంక్షిస్తారు. అంతేకాకుండా భవిష్యత్‌లో తమ వైవాహిక జీవితానికి ఎలాంటి భంగం కలగకుండా జాగ్రత్తపడతారు. ఈ విధానాన్నే వన్ నైట్ స్టాండ్ అంటారు. ఇదంతా ఎందుకంటే త్వరలో ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరగబోతోంది. ఈ ఏడాది ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు ఖతార్ ఆతిథ్యం ఇస్తోంది. సాధారణంగానే ఖతార్‌లో చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి. అందులోనూ ఫుట్‌బాల్ ప్రపంచకప్ అంటే ఎంతోమంది అభిమానులు ఇతర దేశాల నుంచి తరలివస్తారు. దీంతో అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది.
నిజానికి ఐరోపా దేశాల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఉంటే అక్కడ పార్టీలు, వన్ నైట్ స్టాండ్ కార్యక్రమాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అలాంటివి తమ దేశంలో చోటు చేసుకోకుండా ఖతార్ ప్రభుత్వం కఠిన నిబంధనలను జారీ చేసింది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగినన్ని రోజులు వన్ నైట్ స్టాండ్ అంటూ ఎవరైనా కమిట్ అయితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఖతార్‌కు వచ్చే విదేశీ ఫుట్‌బాల్ అభిమానులందరూ ఈ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘించి వన్ నైట్ స్టాండ్ పేరుతో పార్టీలు చేసుకుంటే వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఖతార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఫుట్‌బాల్ అభిమానుల నోట్లో వెలక్కాయ పడినట్లు అయ్యింది.
Five Planet Alignment: ఆకాశంలో అద్భుతం..158 ఏళ్ల తరువాత ఇప్పుడే
