కరోనాపై విజయం సాధించాలంటే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సినేషన్.. దీంతో.. అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి.. కొన్ని వ్యాక్సిన్లు సింగిల్ డోసు అయితే.. మెజార్టీ వ్యాక్సిన్లు మాత్రం ఫస్ట్ అండ్ సెకండ్.. ఇలా రెండు డోసులు వేసుకోవాల్సి ఉంది.. అయితే, రెండు రోజులు వేయించుకున్నా.. కరోనా రాదనే గ్యారంటీ మాత్రం లేదు.. కానీ, ఆస్పత్రిలో చేరే పరిస్థితిని తగ్గిస్తుంది.. ఇక, రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోస్‌పై కూడా ప్రయోగాలు సాగుతున్నాయి.. ఈ తరుణంలో.. ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతించింది. అయితే, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నవారు మాత్రమే.. ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌గా వేసుకోవచ్చని పేర్కొంది..
బూస్టర్ డోసు ఎవరు? ఎప్పుడు? వేయించుకోవాలన్న దానిపై కొన్ని నిబంధనలు పెట్టింది ఎఫ్‌డీఏ.. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నవారు మాత్రమే ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌గా వేసుకోవాలని స్పష్టం చేసింది.. అది కూడా రెండో డోస్ తీసుకున్న 6 నెలల తర్వాతే బూస్టర్ డోస్ వేసుకోవాలని తెలిపింది.. కాగా, రెగ్యులేటరీ ఏజెన్సీ ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ బూస్టర్ డోసుకు సిఫారసు చేయడానికి అనుకూలంగా ఓటు వేసిన తర్వాత ఎఫ్‌డీఏ తాజాగా నిర్ణయం తీసుకుంది.. అయితే, 16 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్‌ల అందజేయాలన్న సిఫార్సులను మాత్రం తిరస్కరించింది వైట్‌హౌస్.
