NTV Telugu Site icon

JP Morgan CEO: F**CK డోంట్ కేర్.. దానిపై సమయం వృథా చేయకండి..

Jp Morgan

Jp Morgan

JP Morgan CEO: అమెరికాలో అతి పెద్ద బ్యాంక్ అయిన జేపీ మోర్గాన్‌లో హైబ్రిడ్ పని చాలా వరకు ముగిసింది. మార్చి నుంచి కార్మికులందరినీ కార్యాలయానికి తిరిగి రావాలని బ్యాంక్ ఆపరేటింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, చాలా మంది ఉద్యోగులు బ్యాక్ టూ ఆఫీస్ అనే రూల్ పై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో తమ పని-జీవిత సమతుల్యతకు ప్రతికూలంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. దీని వల్ల సీనియర్ ఉద్యోగులు, మహిళలు, అంగ వైకల్యాం ఉన్న వ్యక్తులను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. ఐదు రోజుల పాటు ఆఫీసుకి రావాలనే పని విధానాన్ని వ్యతిరేకిస్తూ 1,200 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు అంతర్గత పిటిషన్ పై సంతకాలు చేశారు.

Read Also: Road Accident: వ్యవసాయ కూలీల మృతిపై సీఎం విచారం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం!

ఇక, కంపెనీ ఐదు రోజుల రిటర్న్-టు-ఆఫీస్ (RTO) పని విధానాన్ని పునఃపరిశీలించాలని ఉద్యోగులు చేసిన వినతులను జేపీ మోర్గాన్ చేజ్ సీఈవో జామీ డిమోన్ తిరస్కరించారు. ఉద్యోగులు వేసిన అంతర్గత పిటిషన్‌ను అతడు తోసిపుచ్చారు. దానిపై సమయం వృథా చేయకండి.. ఆ ఫకింగ్ పిటిషన్‌పై ఎంత మంది సంతకం చేశారనేది నాకు ముఖ్యం కాదు అని చెప్పుకొచ్చారు. అయితే, ఉద్యోగులకు జేపీ మోర్గాన్‌లో పని చేయడం లేదా వెళ్లిపోవడం అనే ఆప్షన్స్ ఉన్నాయన్నారు. ఇది స్వేచ్ఛా దేశం అని సీఈవో జామీ డిమోన్ వ్యాఖ్యానించారు.