Site icon NTV Telugu

Nimisha Priya: నిమిషా ప్రియ ఉరిశిక్ష నిలిపివేతకు ఛాన్స్! కొనసాగుతున్న మంతనాలు

Nimishapriya

Nimishapriya

భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షను యెమెన్ అధికారులు వాయిదా వేశారు. ఉరిశిక్ష నిలిపివేతకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. యెమెన్ ప్రభుత్వ పెద్దలతో భారత ప్రభుత్వం మంతనాలు చేస్తోంది. ఎలాగైనా ఉరిశిక్షను నిలిపివేసేందుకు భారత్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగానే యెమెన్ అధికారులు.. ఉరిశిక్ష అమలును నిలిపివేశారు. అయితే ఉరిశిక్ష నిలిపివేతకు నర్సు కుటుంబం.. స్థానిక అధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నష్ట పరిహారంగా బాధిత కుటుంబానికి రూ.8.5 కోట్లు నర్సు కుటుంబం ఆఫర్ చేసింది. కానీ బాధిత కుటుంబం మాత్రం అంగీకరించలేదు. ఒకవేళ నర్సు కుటుంబం విజ్ఞప్తిని అధికారులు పరిగణనలోనికి తీసుకుంటే మాత్రం ఉరిశిక్ష నిలిచే అవకాశం ఉంది. ఈ మేరకు భారత ప్రభుత్వం కూడా యెమెన్ అధికారులు ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారు. ఈ చర్చలేమీ ఫలించకపోతే మాత్రం నిమిషా ప్రియ ఉరి కంభం ఎక్కాల్సిందే.

ఇది కూడా చదవండి: Bhatti Vikramakra : ఫ్యూచర్ సిటీ గేమ్ ఛేంజర్.. అవి పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఊహకు అందదు

కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ 2017, జూలైలో యెమెన్ జాతీయుడు తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కేసులో అరెస్టు అయింది. మరొక నర్సు సహాయంతో మత్తు మందు ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి అతని శరీరాన్ని ముక్కలు చేసి, అవశేషాలను భూగర్భ ట్యాంక్‌లో పడవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నిమిషా ఈ ఆరోపణలను కోర్టులో సవాలు చేసింది. కానీ కోర్టులు ఆమె అప్పీళ్లను తోసిపుచ్చాయి. చివరికి ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చింది. అనంతరం న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్ష విధించింది.

ఇది కూడా చదవండి: Janasena: భిన్నత్వంలో ఏకత్వం.. జాతీయ సమగ్రత, భాషా సామరస్యంపై పవన్‌ ఆలోచన అదే..

నిమిషా ప్రియ.. 2008 నుంచి యెమెన్‌లో నర్సుగా పనిచేస్తోంది. 2011లో వివాహం తర్వాత ఆమె తన భర్త టామీ థామస్‌తో కలిసి యెమెన్‌ దేశానికి వెళ్లింది. 2014లో యెమెన్‌లో అంతర్యుద్ధం కారణంగా ఆమె భర్త కుమార్తెతో కేరళకు తిరిగి వచ్చేశాడు. నిమిషా మాత్రం యెమెన్‌లోనే ఉండిపోయింది. అనంతరం ఆమె యెమెన్ జాతీయుడితో కలిసి నర్సింగ్ హోమ్ ప్రారంభించింది. అయితే ఆమెపై మెహదీ అఘాయిత్యం చేయబోయాడు. అనేక మార్లు శారీరికంగా వేధించాడు. అంతేకాకుండా పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నాడు. అయితే పాస్‌పోర్టును తిరిగి పొందే క్రమంలో మత్తు మందులు ఇచ్చానని.. కానీ అతడు అధిక మోతాదులో తీసుకోవడం వల్లే చనిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైలులో ఉంది.

ఇక ఉరిశిక్షను ఆపాలంటూ ప్రధాని మోడీకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ఈ మేరకు ఫిబ్రవరి 6, మార్చి 24, 2025న లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖలు పంపి విజ్ఞప్తి చేశారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్ కూడా కేంద్రాన్ని కోరారు.

అయితే ప్రస్తుతం యెమెన్ దేశం హౌతీల నియంత్రణలో ఉంది. దీంతో దౌత్యపరంగా భారత్‌కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆమె విడుదల కోసం కేంద్రం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. అయితే బాధితుడు.. ఒక పెద్ద కుటుంబంతో సత్సంబంధాలు ఉండడంతో మంతనాలు చురుగ్గా సాగడం లేదు. అయినప్పటికీ భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నర్సు కుటుంబ సభ్యులు, భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఏం జరుగుతుందో మరికొన్ని వేచి చూడాల్సి ఉంది.

Exit mobile version