NTV Telugu Site icon

Biden vs Trump debate: ట్రంప్ దూకుడు,తేలిపోయిన బైడెన్..వాడీవేడిగా తొలి డిబేట్..

Biden Vs Trump Debate

Biden Vs Trump Debate

Biden vs Trump debate: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా తొలిసారి ప్రెసిడెంట్ జో బైడెన్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత తొలిసారిగా వీరిద్దరు తలపడ్డారు. అట్టాంటాలోని సీఎన్ఎన్ ప్రధాన కార్యాలయంలో ఈ చర్చ జరిగింది. చర్చల్లో ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. బైడెన్‌ని ట్రంప్ ఫెయిల్యూర్ అని విమర్శించగా, దీనికి ప్రతిగా బైడెన్ ట్రంప్‌ని దోషి అంటూ వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. చర్చల్లో ట్రంప్ పైచేయి సాధించినట్లు సీఎన్ఎన్ పోల్ తెలిపింది. మొత్తం చర్చలో ట్రంప్ 23 నిమిషాలు మాట్లాడగా.. బైడెన్ 18 నిమిషాల 26 సెకన్లు మాట్లాడారు. ఇదిలా ఉంటే, ఇద్దరు నేతలు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం, వలసలు, ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంపై ఇరువురు మాట్లాడారు.

ట్రంప్ కేవలం సంపన్నులకు అనుకూలంగా ఆర్థిక విధానాలనున అనుసరించారని బైడెన్ ఆరోపించగారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నిరుద్యోగం 15 శాతనికి చేరిందని ఆయన అన్నారు. దీనికి ట్రంప్ బదులిస్తూ బైడెన్ హయాంలో కేవలం అక్రమ వలసదారులకు మాత్రమే ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ద్రవ్యోల్భనం, పన్నుకోతల వల్ల ఎప్పుడూ లేనంతగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని అన్నారు.

Read Also: Kakani Govardhan Reddy: ప్రజల్లో వైసీపీకి ఆదరణ తగ్గలేదు.. వారికి అండగా ఉంటాం..!

విదేశాంగ విధానంపై ఇరువురు మధ్య తీవ్రస్థాయిలో చర్చ నడిచింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ దారుణంగా సాగిందని ట్రంప్ విమర్శించారు. తన హయాంలో చాలా గౌరవప్రదంగా సైనికులు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ట్రంప్ హయాంలోనే తాలిబాన్లు అమాయకపు ఆఫ్ఘాన్నలను చంపారని, చివరకు అక్కడ మరణించిన అమెరికా సైనికులను కూడా ట్రంప్ తిట్టారని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్‌కి ట్రంప్ పూర్తి స్వేచ్ఛనిచ్చారని, రష్యా ప్రతిదాడిని సమర్థిస్తున్నాడని ఆరోపించారు. అక్రమ వలసదారులను ఆహ్వానిస్తున్నానే ట్రంప్ వ్యాఖ్యల్లో నిజం లేదని బైడెన్ అన్నారు. దీనిని ఉద్దేశిస్తూ, దేశ దక్షిణ సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచడటంలో బైడెన్ విఫలమయ్యారని ట్రంప్ ఆరోపించారు.

గర్భవిచ్ఛత్తి నిషేధాన్ని బైడెన్ తప్పుబట్టారు. దీనిని వైద్యులు, మహిళలకే వదిలేయాని, రాజకీయ నాయకులు చర్చించే అంశం కాదని బైడెన్ చెప్పారు. అయితే దీనిపై నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేయాలని ట్రంప్ చెప్పారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇద్దరూ కూడా ఇజ్రాయిల్‌కి మద్దతుగా నిలిచారు. యుద్ధం బాధ్యత మొత్తం హమాస్‌దే అని బైడెన్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.