F-16 Fighter Jet Crash: అమెరికాలో F-16 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియో వైరల్, దర్యాప్తు షురూ
- అమెరికాలో శిక్షణ విమానానికి ప్రమాదం
- F-16 కూలి పైలట్‌కు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
F-16 Fighting Falcon Crash in America: అమెరికాలో శిక్షణ విమాన ప్రయాణం సమయంలో టెక్సాస్ ఎయిర్ నేషనల్ గార్డ్‌కు చెందిన F-16 ఫైటర్ జెట్ ప్రమాదానికి గురైంది. మిషిగన్‌లోని గ్రాండ్ ట్రావర్స్ కౌంటీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం తర్వాత పైలట్ సురక్షితంగా విమానం నుంచి బయటకు వచ్చాడు. అయితే అతడికి గాయాలు కాగా, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
శిక్షణ సమయంలోనే ప్రమాదం
CBS న్యూస్ ప్రకారం, టెక్సాస్ నేషనల్ గార్డ్‌కు చెందిన 149వ ఫైటర్ వింగ్ నిర్వహిస్తున్న F-16 ఫైటింగ్ ఫాల్కన్ సాధారణ శిక్షణ విమాన ప్రయాణంలో ఉండగా ప్రమాదానికి గురైంది. ఈ విమానం అల్పెనా ప్రాంతంలోని ఎయిర్ నేషనల్ గార్డ్ కాంబాట్ రెడీనెస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి శిక్షణ మిషన్‌పై బయలుదేరింది. ఈ క్రమంలో గ్రాండ్ ట్రావర్స్ కౌంటీలో కూలిపోయింది.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
పైలట్‌కు గాయాలు.. పరిస్థితి నిలకడగా
టెక్సాస్ మిలిటరీ డిపార్ట్మెంట్ ప్రమాదాన్ని ధ్రువీకరించింది. 149వ ఫైటర్ వింగ్ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం, పైలట్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది. ప్రమాదానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. గ్రాండ్ ట్రావర్స్ కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి సహాయం అందిస్తున్న మిషిగన్ స్టేట్ పోలీసుల ప్రకారం, ఇప్పటివరకు మరెవరూ గాయపడినట్లు సమాచారం లేదు.
ప్రమాద ప్రాంతం ఖాళీ చేయించాలని ఆదేశాలు
‘ద హిల్’ నివేదిక ప్రకారం, మిషిగన్ స్టేట్ పోలీసులు ప్రమాద స్థలం చుట్టూ ఒక మైలు పరిధిలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. విమానం కూలిన తర్వాత ప్రమాదకర రసాయనాలు లీక్ అయ్యే అవకాశం ఉందనే ఆందోళనతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతకుముందు స్థానిక ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని అధికారులు సూచించారు.
రహదారులు మూసివేత.. ప్రజలకు హెచ్చరిక
F-16 ఫైటర్ జెట్ కౌంటీ రోడ్ 633, బ్లెయిర్ టౌన్‌హాల్ రోడ్ సమీపంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలం చుట్టుపక్కల రహదారులను మూసివేశారు. అత్యవసర సహాయక బృందాలు తమ విధులు నిర్వహించేందుకు వీలుగా నివాసితులు, వాహనదారులు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు.
పక్షిని ఢీకొట్టిందా? దర్యాప్తు ప్రారంభం
‘ద హిల్’ కథనం ప్రకారం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆడియోలో F-16 కూలిపోవడానికి కొద్దిసేపటి ముందు విమానం ఏదైనా పక్షిని ఢీకొని ఉండొచ్చనే సంకేతాలు కనిపించాయి. అయితే విమానం పక్షిని ఢీకొట్టిందనే విషయాన్ని సైనిక అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
Texas Air National Guard: pilot SAFE after Michigan F-16 crash
'Successfully ejected from aircraft… incident under investigation' pic.twitter.com/bl9Llw6KR8
— RTVisual (@RT_Visual_on_X) September 17, 2026
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!