Site icon NTV Telugu

Russia Ukraine War: రాజధాని కీవ్‌పై బాంబుల వర్షం.. 137 మంది మృతి

ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా… రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్‌ చేసింది రష్యా.. కీవ్‌ను చుట్టుముట్టాయి రష్యా బలగాలు, కీవ్‌కు వెళ్లే రోడ్లు అన్నింటినీ దిగ్బంధించాయి రష్యా సేనలు… ఉక్రెయిన్‌పై మెరుపు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలు, ఉక్రెయిన్‌ సైనిక, వైమానిక స్థావరాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడుతోంది.. ఇప్పటి వరకు 83 స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించగా.. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 137 మంది ఉక్రెయిన్​పౌరులు మృతిచెందినట్టుగా చెబుతున్నారు.. వందలాది మంది గాయాలపాలయ్యారు.. రష్యా భీకర దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్​ బలగాలు, సైనిక సమీకరణకు జెలెన్​స్కీ ఆదేశాలు జారీ చేశారు. రానున్న 90 రోజుల పాటు ఇవి అమల్లో ఉండనున్నాయి..

Read Also: Tirumala: సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త

కాగా, గత కొంతకాలంగా ఉక్రెయిన్‌-రష్యా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. ముందస్తు వ్యూహం ప్రకారం గురువారం తెల్లవారుజామున బెలారస్‌ వైపు నుంచి సైనిక బలగాలతో ఉక్రెయిన్‌లో ప్రవేశించింది. దూకుడుగా మున్ముందుకు దూసుకెళ్లింది.. గగనతల రక్షణ వ్యవస్థలు, సైనిక వైమానిక స్థావరాలు, రక్షణ శాఖ ఆయుధాగారాలపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది.. టార్గెట్‌లను గురితప్పకుండా ఛేదించే ఆయుధాలతో రష్యా దాడులకు దిగితోంది.. దీంతో ఉక్రెయిన్‌ ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి.. ఇప్పటికే 137 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయాలపాలయ్యారు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో వణికిపోతున్నారు ప్రజలు.

Exit mobile version