కొన్ని దేశాలు మినహా మెజార్టీ దేశాలు తనపై ఆంక్షలు విధిస్తున్నా యుద్ధంపై వెనక్కి తగ్గడం లేదు రష్యా.. 25 రోజులకు పైగా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది.. ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్నా.. ఇక యుద్ధానికి పులిస్టాప్ అంటూ కొంత ప్రచారం సాగుతున్నా.. ఉక్రెయిన్‌పై పట్టుకోసం రష్యా బలగాలు చెమటోడుస్తూనే ఉన్నాయి.. ఉక్రెయిన్ సైన్యం నుంచి కూడా ఇంకా తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు. అయితే, ఇదే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ ప్రేయసిని చిక్కుల్లోకి పడేసింది.. ఆమె.. అలినా కబేవా.. రష్యా జిమ్నాస్ట్.. 2004 ఏథేన్స్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి సత్తాచాటారు.. ఆమె.. పుతిన్‌తో 2008 నుంచి కలిసి ఉంటున్నట్లు.. ఆమె పుతిన్ గర్ల్‌ఫ్రెండ్ అనే ప్రచారం కూడా ఉంది. అదే ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది.. ప్రస్తుతం అలినా కబేవా.. స్విట్జర్లాండ్‌లో నివాసం ఉంటున్నారు.. ముగ్గురు పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్‌లోని ఓ లగ్జరీ విల్లాలో ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also: Congress: పదవుల కోతపై స్పందించిన జగ్గారెడ్డి..
అయితే, ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో.. స్విట్జర్లాండ్ నుంచి అలినా కబేవాను వెళ్లగొట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రేయసిని దేశం నుంచి తరిమేయాలంటూ ఆన్‌లైన్‌లో ఓ పిటిషన్ పెట్టారు.. ఆ పిటిషన్‌పై ఉక్రెయిన్, బెలారస్, రష్యాకు చెందినవారు కూడా కొందరు సంతకం చేశారు.. మొత్తంగా సుమారు 50 వేల మంది ఆ పిటిషన్‌పై కూడా సంతకం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె వయస్సు 38 ఏళ్లు కాగా.. గతంలో పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ పార్లమెంట్ సభ్యురాలిగా కూడా ఆమె ఆరేళ్లు పనిచేశారు.. ది గార్డియన్ వంటి అనేక ప్రచురణలు కబేవా పుతిన్ స్నేహితురాలు అని పేర్కొన్నాయి. అయితే, రష్యా అధ్యక్షుడు.. దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో కబేవాను స్విట్జర్లాండ్‌కు పంపినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్ తెరపైకి వచ్చింది.. ఆమె ఏడేళ్లకు పైగా క్రెమ్లిన్ అనుకూల మీడియా గ్రూప్ అయిన నేషనల్ మీడియా గ్రూప్‌లో డైరెక్టర్ల బోర్డు చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. ది డైలీ మెయిల్ ప్రకారం, ఆమె సంవత్సరానికి దాదాపు £8 మిలియన్ల వేతనం పొందుతున్నారు.. అయితే, కబేవా చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తాడు. గత ఏడాది డిసెంబర్‌లో మాస్కోలో జరిగిన డివైన్ గ్రేస్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌లో ఆమె చివరిసారిగా కనిపించారు.