Site icon NTV Telugu

Gotabaya Rajapaksa: అమెరికాలో స్థిరపడాలని చూస్తున్న గొటబాయ.. గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు!

Gotabaya Rajapaksa

Gotabaya Rajapaksa

Gotabaya Rajapaksa: తన రాజీనామాను డిమాండ్ చేస్తూ భారీ నిరసనల మధ్య జులైలో ద్వీపం దేశం శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన భార్య, కొడుకుతో కలిసి అమెరికాలో స్థిరపడాలని చూస్తున్నట్లు సమాచారం. అక్కడ స్థిరపడేందుకు గ్రీన్‌ కార్డు కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. యన భార్య, కుమారుడితో అక్కడ స్థిరపడేందుకు సిద్ధమౌతున్నారని శ్రీలంక వార్తా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. రాజపక్స భార్య లోమా అమెరికా పౌరురాలు కావడంతో రాజపక్స గ్రీన్‌కార్డు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతం కలిగి ఉన్నందున, దీనికి సంబంధించిన ప్రక్రియను అగ్రరాజ్యంలో రాజపక్స న్యాయవాదులు గతనెలలోనే ప్రారంభించారని శ్రీలంక మీడియాలో కథనాలు వచ్చాయి.

Rishi Sunak: జన్మాష్టమి వేడుకలు.. భార్యతో కలిసి పూజలు చేసిన రిషి సునాక్

2019లో శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు గొటబాయ తన అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. 1998లో అమెరికాకు వలస వెళ్లే ముందు శ్రీలంక సైన్యం నుంచి ముందస్తు పదవీ విరమణ పొందిన గొటబాయ రాజపక్స.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలోకి వెళ్లారు. 2005లో మళ్లీ శ్రీలంకకు తిరిగి వచ్చారు. ప్రస్తుతం తన భార్యతో కలిసి బ్యాంకాక్‌ హోటల్‌లో ఉన్న ఆయన.. థాయిలాండ్‌లో ఉండాలన్న ప్రణాళిక రద్దు చేసుకుని, ఆగస్టు 25న శ్రీలంకకు తిరిగి వస్తారని శ్రీలంక వార్తా పత్రిక డైలీ మిర్రర్‌ పేర్కొంది. గొటబయ రాజపక్స ఒక నెల రోజుల బస తర్వాత సింగపూర్ నుంచి ఆగస్టు 11న సాయంత్రం ధాయిలాండ్ చేరుకున్నారు. ప్రజా నిరసనల మధ్య రాజపక్స గత నెలలో తన ద్వీప దేశం నుండి పారిపోయిన తర్వాత తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో స్థిరపడేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version