Site icon NTV Telugu

Qamar Javed Bajwa: పాకిస్తాన్ ఆర్మీకి అంత సీన్ లేదు.. పాక్ ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Qamar Javed Bajwa

Qamar Javed Bajwa

Ex-Pak Army Chief General Bajwa Said Pak Military Was No Match for Indian Army: పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్‌ కమర్ జావెద్ బజ్వా తన సొంత సైన్యంపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ సైన్యంతో పోరాడే శక్తి, సామర్థ్యాలు పాక్ ఆర్మీకి లేదని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. ఆ స్థాయి ఆయుధ సంపత్తి సైతం పాక్ ఆర్మీ వద్ద లేదని బాంబ్ పేల్చారు. బ్రిటన్‌లోని పాకిస్తాన్ మీడియా జర్నలిస్టులు హమీద్ మీర్, నజీం జెహ్రాలకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.

GT vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ముంబై ఇండియన్స్

జావెద్ మాట్లాడుతూ.. ‘‘ఇండియన్ ఆర్మీకి పాక్ ఆర్మీ ఏమాత్రం సరితూగలేదు. భారత్‌తో యుద్ధానికి దిగే పరిస్థితి పాక్‌కి లేదు. ట్యాంకులు ఏమాత్రం పని చేయడం లేదు. ఫిరంగులను తరలించేందుకు డీజిల్ సైతం లేదు’’ అని చెప్పుకొచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు.. పాక్ దేశ సైనిక సామర్థ్యాలపై ప్రశ్నలు లేవెనత్తేలా, సైన్యం నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయి. పాకిస్తాన్ కమాండర్స్ సదస్సులో జావెద్ బజ్వా ఈ వ్యాఖ్యలు చేసినట్లు.. జర్నలిస్ట్ హమీద్ మీర్ వెల్లడించాడు. అంతేకాదు.. పాకిస్తాన్ వద్ద పెద్దగా ఆప్షన్స్ లేవు కాబట్టి భారత్‌తో శతృత్వం పెంచుకోవడం కన్నా స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపరచుకుంటేనే ఉత్తమమని జావెద్ అభిప్రాయపడినట్టు మీర్ తెలిపాడు. భారత్‌తో ఉన్న సుదీర్ఘ విరోధం పాక్ దేశాన్ని హరించేస్తోందని.. భారత్‌తో పోరాడేందుకు కావాల్సిన ఆయుధ సంపద, ఆర్థిక బలం పాకిస్తాన్‌కు వద్ద లేవు కాబట్టి, కశ్మీర్ సమస్యపై ఇరుదేశాలు శాశ్వత పరిష్కారానికి వచ్చే విషయంపై సమాలోచనలు జరుగుతున్నాయని బజ్వా పేర్కొన్నట్టు చెప్పాడు.

Dubai Sand Plot: రికార్డ్ ధరకి ఇసుక ప్లాట్.. ఓనర్‌కి 242% లాభం

కాగా.. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ సంక్షోభంతో.. అక్కడి ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలు రావడంతో.. సరైన తిండి లేక విలవిలలాడుతున్నారు. ఉద్యోగాలు కూడా ఊడి.. అనేకమంది ఆకలితో అలమటిస్తున్నారు. జీతాల్లో కోతలు సైతం విధించారు. పంజాబ్ ప్రావిన్స్‌లో ఎన్నికలపై ప్రభుత్వం, న్యాయవ్యవస్థ ఘర్షణ పడటంతో.. పాకిస్తాన్ రాజకీయ పరిస్థితి పెళుసుగా తయారైంది. ఈ సమస్యలు చాలవన్నట్టు.. తెహ్రీక్-ఏ-తాలిబన్ నుంచి ఆ దేశం దాడుల్ని ఎదుర్కుంటోంది. వాయువ్య పాకిస్తాన్‌లో భద్రతా సిబ్బందిపై తాలిబన్లు దాడి చేయడంతో.. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.

Exit mobile version