Site icon NTV Telugu

Breaking News: నేపాల్‌లో ఆగని ఆందోళనలు.. మాజీ ప్రధాని భార్య సజీవ దహనం

Nepal

Nepal

Breaking News: సోషల్ మీడియా బ్యాన్‌తో నేపాల్‌లో ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. జెన్ జెడ్ యువత ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సోమవారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. ఆందోళనకారులు ప్రధాని కేపీ శర్మ ఓలి నివాసంతో పాటు అధ్యక్ష, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడి చేసి, నిప్పటించారు.

Read Also: E-Race Case : ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ నివేదిక ప్రభుత్వానికి సమర్పణ..కేటీఆర్ పై మళ్లీ దృష్టి

ఇదిలా ఉంటే, నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయి. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్ (65) ఖాట్మాండు వీధుల్లో ఉరికించి కొట్టారు. మాజీ ప్రధాని ఝలనాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పటించారు. ఇంటిలో ఉన్న ఆయన భార్య కాలిన గాయాలతో మరణించారు. మాజీ ప్రధాని భార్య రాజ్యలక్ష్మీ చిత్రాకార్ మంగళవారం సజీవదహనం అయ్యారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. నిరసనకారులు ఆమెను తన ఇంట్లో బంధించిన ఇంటికి నిప్పటించారు. ఈ సంఘటన రాజధాని ఖాట్మాండులోని డల్లు ప్రాంతంలో జరిగింది. చిత్రకర్‌ను కీర్తిపూర్ బర్న్ ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మరణించారు.

Exit mobile version